బాక్సాఫీస్ : భారీ మైలురాయికి దగ్గరలో “ఆదిపురుష్”.!

ఈ ఏడాదికి బిగ్గెస్ట్ సినిమాగా రిలీజ్ కి వచ్చిన భారీ పాన్ ఇండియా సినిమా “ఆదిపురుష్” కూడా ఒకటి. మరి గతంలో జనవరిలో వచ్చిన పఠాన్ సినిమా తర్వాత మళ్ళీ అంతకు మించి స్పాన్ ఉన్న సినిమాగా అయితే వచ్చిన ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ సాధించింది.

అయితే మేకర్స్ మాత్రం కరెక్ట్ గా రౌండ్ ఫిగర్స్ ఎక్కడా తేడా లేకుండా అనౌన్స్  చేస్తుండడం ఆసక్తిగానే ఉంది కాయాన్ని ఇప్పుడు అయితే ఆదిపురుష్ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు అనౌన్స్ చేసారు. మరి నిన్న నాలుగు రోజుల్లో 375 కోట్లు గ్రాస్ వరల్డ్ వైడ్ గా అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు మొత్తం 5 రోజుల్లో అయితే ఆల్ మోస్ట్ భారీ మైల్ స్టోన్ 400 కోట్లకి సినిమా వచ్చేసినట్టుగా తెలిపారు.

మై ఈ ఐదో రోజుకి ఈ చిత్రం 20 కోట్ల గ్రాస్ తో 395 కోట్లకి చేరింది. అయితే వీక్ డేస్ లో మాత్రం ఆదిపురుష్ చిత్రం దారుణంగా పడిపోతుంది అని చెప్పాలి. వరల్డ్ వైడ్ గ్రాస్ 20 కోట్లు అంటే తెలుగు సహా హిందీ. ఓవర్సీస్ మార్కెట్ లో యావరేజ్ గా ఐదేసి కోట్లు మాత్రమే వస్తున్నాయి అని చెప్పాలి.

మరి వారాంతానికి మళ్ళీ సినిమా ఏమన్నా పుంజుకుంటుందో లేదో చూడాలి. ఇక ఈ మాసివ్ చిత్రంలో ప్రభాస్ హీరోగా కృతి సనన్ హీరోయిన్ గా దర్శకుడు ఓంరౌత్ ఈ చిత్రాన్ని హిందీ సహా తెలుగులో తెరకెక్కించాడు. అలాగే సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.