లేటెస్ట్ : రోమాలు నిక్కబొడిచేలా ‘జైశ్రీరామ్’ ఫుల్ వెర్షన్.!

మన చరిత్ర.. మన పురాణాలు ముఖ్యంగా అందులో రామాయణ మహా భారతాలను అయితే ఎంతో గౌరవంగా చూస్తారు. ఇప్పటికీ కూడా సీరియల్స్ లో ఇవి పెద్ద హిట్స్ గా నిలిచాయి. అయితే అందరికీ తెలిసిందే అయినా ఇప్పటికీ ఎన్నో సార్లు ఎందరో నటించిన కథ అయినప్పటికీ ఎన్ని వందల సార్లు చూసినా మళ్ళీ చూడాలి అనిపించేది రామాయణం.

మరి ఈ రామాయణాన్ని కొన్ని తెలియని కోణాలను కూడా ప్రెజెంట్ చేసి దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన సినిమానే “ఆదిపురుష్”. మన టాలీవుడ్ హీరో ప్రభాస్ తో చేసిన ఈ మాసివ్ విజువల్ వండర్ లో అయితే మొదటగా టీజర్ రాగా అందులో ఈ చిత్రంలో జై శ్రీరామ్ సాంగ్ కి అప్పట్లోనే అదిరే రెస్పాన్స్ రాగా..

ఈ సాంగ్ పూర్తి వెర్షన్ కోసం ఆసక్తిగా అభిమానులు ఎదురు చూస్తూ ఉండగా ఈ చిత్రం నుంచి ఈరోజు చిత్ర యూనిట్ జై శ్రీరామ్ ఫుల్ సాంగ్ ని అయితే యూట్యూబ్ కన్నా ముందే పలు మ్యూజిక్ ప్లాట్ ఫామ్స్ లో రిలీజ్ చేశారు. కాగా ఈ సాంగ్ అయితే రోమాలు నిక్కబొడిచేలా ఉందని చెప్పాలి.

రామజోగయ్య శాస్త్రి ఇచ్చిన ఫుల్ లిరిక్స్ చాలా బాగున్నాయి అలాగే సంగీత దర్శకులు ఇచ్చిన మ్యూజిక్ బిగ్గెస్ట్ ఎసెట్ అని చెప్పొచ్చు. హాలీవుడ్ చిత్రాల్లో పలు హిస్టారికల్ సినిమాలకి ఎలాంటి కోరస్ తో అద్భుతమైన ట్యూన్ ఉంటుందో అదే టెంపో లో ఈ సాంగ్ కూడా ఉంది.

దీనితో ఈ చిత్రం సాంగ్ మాత్రం అంచనాలు మించే లెవెల్లో ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కాగా ఈ చిత్రంలో కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్ తదితరులు కీలక పాత్రల్లో నటించగా ఈ జూన్ 16న గ్రాండ్ గా ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది.