గ్లోబల్ గా దారుణంగా పడిపోతున్న “ఆదిపురుష్” వసూళ్లు.!

ఈ ఏడాది నెక్స్ట్ బిగ్ థింగ్ అవుతుంది అనుకోని రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ భారీ పాన్ ఇండియా సినిమా “ఆదిపురుష్”. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా హిందీ దర్శకుడు ఓంరౌత్ తో అయితే చేసిన ఈ చిత్రం రామాయణం ఆధారంగా తెరకెక్కింది కానీ ఈ చిత్రం రిలీజ్ అయ్యాక అందుకున్న ఫీడ్ మాత్రం పూర్తి నెగిటివ్ గా వచ్చింది అని చెప్పాలి.

దీనితో మొదటి మూడు రోజులు ఫ్లో లో వసూళ్లు అదరగొట్టేసిన ఈ సినిమా నాలుగో రోజు నుంచి అయితే భారీ డ్రాప్ చూడాల్సి వచ్చింది. ఇక ఇది అలా కంటిన్యూ అవుతూ గ్లోబల్ గా మాత్రం ఆదిపురుష్ రోజురోజుకి డ్రాప్ చూస్తుంది. కాగా ఇప్పుడు అయితే 6 రోజులు కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం మొత్తం ఈ 6 రోజుల్లో 410 కోట్ల మార్క్ కి అయితే చేరుకుంది.

దీనితో 6వ రోజు అయితే మరీ దారుణంగా ప్రపంచ వ్యాప్తంగా కేవలం 5 కోట్ల గ్రాస్ ని మాత్రమే ఈ చిత్రం అందుకోవడం గమనార్హం. దీనితో అయితే ఆదిపురుష్ లాంగ్ రన్ లో భారీ నష్టాలు మెయిన్ గా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువే మిగిల్చేలా ఉందని ట్రేడ్ వర్గాలు ఆల్రెడీ చెప్పేస్తున్నాయి.

ఇప్పుడు అయితే టికెట్ ధరలు 3డి వెర్షన్ లో తగ్గిస్తాం అని చెప్తున్నారు. మరి ఇవేమన్నా తర్వాత ప్లస్ అవుతాయో లేదో చూడాలి. మొత్తానికి అయితే ఆదిపురుష్ కి ముందు కష్టాలు తప్పేలా లేవనే చెప్పాలి. కాగా ఈ చిత్రంలో కృతి సనన్, సోనాల్ చైహం, సైఫ్ అలీఖాన్, దేవ్ దత్, అలాగే సన్నీ సింగ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.