తల్లి కాబోతున్న నటి పూర్ణ… శుభాకాంక్షలు తెలియజేస్తున్న అభిమానులు!

ఏడాదిలో ఎంతోమంది సినీ సెలెబ్రిటీలు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభించారు. మరికొందరు తల్లిగా ప్రమోట్ అయ్యారు.అయితే ఈ ఏడాది వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టి వచ్చే ఏడాదిలో తల్లి కాబోతున్నారు నటి పూర్ణ.తెలుగు తమిళ మలయాళ సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు పొందారు. అయితే పూర్ణ ఈ ఏడాది జూన్ 12వ తేదీ ఆసిఫ్ అలీ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు.

వీరి వివాహం దుబాయ్ లో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే వీరి వివాహం జరిగింది. అయితే వివాహ విషయాన్ని రహస్యంగా దాచిన పూర్ణ వివాహం జరిగిన కొన్ని రోజులకు తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి అందరికీ తనకు పెళ్లి జరిగిన విషయాన్ని తెలిపారు.ఇలా పెళ్లి విషయాన్ని రహస్యంగా ఉంచినటువంటి ఈమె తాజాగా కొత్త సంవత్సరం రాబోతున్న సమయంలో తన అభిమానులకు శుభవార్త చెప్పారు.

ఈ క్రమంలోనే తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈమె ఈ శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు.పూర్ణ త్వరలోనే తల్లి కాబోతుందని యూట్యూబ్ వీడియో ద్వారా ఈ శుభవార్తను అందరికీ తెలియజేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక పూర్ణ తల్లి కాబోతుందని తెలియడంతో ఎంతోమంది అభిమానులు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం పూర్ణకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.