నేనూ హీరోయిన్‌నే.! నాకేం తక్కువ.?

నాకేమంత వయసయిపోయిందని.? గ్లామర్ విషయంలో నాకేం తక్కువ.? అంటోందిట ఓ అందాల భామ.! ఎవరామె.? ఏమా కథ.? ఓ సినిమాతో అనూహ్యంగా సినీ రంగంలో స్టార్‌డమ్ దక్కించుకుందామె.! బుల్లితెరపైనా తన హవా చాటుకుందిలెండి.!

బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు రావడంతో.. ఆ బ్యూటీని పెద్దగా ఎవరూ పట్టించుకోవడంలేదు. అలాగని, సినిమాల్లో అవకాశాల్లేవా.? అంటే, కొన్ని ప్రాజెక్టులు చేతిలో వున్నాయి. అందులో పెద్ద ప్రాజెక్టులూ వున్నాయ్.

ఓ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో, ‘హీరోయిన్ కంటే నేనేం తక్కువ కాదు’ అంటూ యాటిట్యూడ్ చూపించిందట ఆ ముదురు భామ.! అంతే, అక్కడున్నోళ్ళంతా షాక్ అయ్యారట.

అటెన్షన్ కోసం ఆమె బాగా పబ్లిసిటీ స్టంట్లు చేస్తుందని అంటుంటారు కొందరు. ఈ క్రమంలోనే, సినిమా సెట్లో లేనిపోని హంగామా చేసిందా.? అనే అనుమానమూ వ్యక్తం చేస్తున్నారు.

‘అబ్బే, అదేం లేదు.. సెట్స్‌లో ఆమె ప్రొఫెషనల్‌గానే వుంటుంది’ అంటూ ఇంకో వెర్షన్ కూడా వినిపిస్తోంది ఆమె గురించి. ఎవరా భామ.? ఏమా కథ.? అదైతే సస్పెన్స్.!