ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన దళపతి కొడుకు.. గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టున్నాడు!

ఏ స్టార్ హీరోకైనా వారసులు వస్తే వాళ్ళు హీరోలు అవ్వాలని ప్రేక్షకులంతా ఎదురుచూస్తూ ఉంటారు. ఇలాంటి సంఘటనలు చాలా హీరోలకు జరిగాయి వాళ్ళ వారసులు హీరోలుగా మారి వాళ్లకు అంటూ ఫ్యాన్డం తెచ్చుకోవడం ఇండస్ట్రీలో కొత్తేమీ కాదు. అలాగే తమిళ్ సూపర్ స్టార్ అయిన దళపతి విజయ్ కొడుకు జేసన్ సంజయ్ ని కూడా అందరూ హీరో అవుతాడు అనుకుంటే సంజయ్ మాత్రం బాట తప్పి డైరెక్షన్ ఎంచుకొని అందరికీ షాక్ ఇచ్చాడు.

ఏ స్టార్ హీరో సినిమా అయినా టైటిల్ రిలీజ్ చేయకముందు తన పేరు పక్కన అది ఎన్నో సినిమానో అంకెలతో హ్యాష్ టాగ్ చేసి వర్కింగ్ టైటిల్ గా ప్రకటిస్తారు కానీ మొట్టమొదటిసారి యువ డైరెక్టర్ పేరు పెట్టి ట్యాగ్ 1 గా ప్రకటించిన సంఘటన తాజాగా తమిళ ఇండస్ట్రీలో చోటు చేసుకుంది. జేసెన్ సంజయ్ దర్శకుడిగా సందీప్ కిషన్ ని హీరోగా పెట్టి తీస్తున్న సినిమాకి వర్కింగ్ టైటిల్ జేసన్ సంజయ్ వన్ గా ప్రకటించారు చిత్ర బృందం.

తెలుగు ఇండస్ట్రీలో సందీప్ కిషన్ కి మంచి పేరు ఉన్నా తమిళ ఇండస్ట్రీలో తను తాజాగా నటించిన రాయన్ సినిమాతో రెండింతలు పెంచి మరి మంచి ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్నాడు సందీప్ కిషన్. ఈ సినిమాని పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఐన లైకా ప్రొడక్షన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. కత్తి సినిమాతో లైకా ప్రొడక్షన్స్ కి లైఫ్ని ఇచ్చిన విజయ్ కి కృతజ్ఞతగా ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారేమో. ఈ సినిమాకి వర్క్ చేస్తున్న టెక్నీషియన్స్ కూడా మంచి పేరు తగిన వారే.

పెద్ద బడ్జెట్ తో రిలీజ్ చేస్తున్న ఈ సినిమా ప్రీ టీజర్ ఆసక్తికరంగా ఉంది. కమర్షియల్ వే లో కాకుండా కంటెంట్తో కొట్టబోతున్నట్టున్నాడు యువ దర్శకుడు జేసన్. అయితే ఈ సినిమాని తమిళం తో పాటు తెలుగులో కూడా ఒకేసారి విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారు. తండ్రి సినిమా ఇండస్ట్రీ ని వదిలి వెళుతున్న వేల కొడుకు వచ్చి ఆ లోటు తీరుస్తున్నాడు అంటూ తమిళ ప్రేక్షకులందరూ జేసన్ నీ చూసి మురిసిపోతున్నారు