Abhinaya: సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మహేష్ బాబు చెల్లెలు పాత్రలో నటించి ఎంతో మంది తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు నటి అభినయ. అంతకుముందు పలు సినిమాలలో సహాయ పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు ఇక ఈ సినిమా తర్వాత ఈమె పాత్రకు మంచి గుర్తింపు రావడంతో అభినయకు పెద్ద ఎత్తున తెలుగు తమిళ భాష చిత్రాలలో సపోర్టింగ్ చేసే అవకాశం వస్తుంది.
ఇక అభినయ పుట్టుకతోనే చవిటి మూగ సమస్యలతో బాధపడుతూ జన్మించారు అయినప్పటికీ వాటిని తన బలహీనతలుగా మార్చుకోకుండా వాటిని బలంగా తీసుకొని ఇండస్ట్రీలోకి వచ్చి నటిగా మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక అభినయ నటనకు గాను ఎన్నో రకాల అవార్డులు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నా అభినయ గత కొంతకాలంగా నటుడు విశాల్ ప్రేమలో ఉన్నారు అంటూ వార్తలు వినిపించాయి.
ఇలా విశాల్ తో చాలా సన్నిహితంగా ఉన్న ఫోటోలు కూడా బయటకు రావడంతో వీరిద్దరు ప్రేమలో ఉన్నారని వార్తలు వినిపించిన నేపథ్యంలో అభినయ ఈ వార్తలపై స్పందించారు. తాను నిజంగానే ప్రేమలో ఉన్నానని గత 15 సంవత్సరాలుగా తన చిన్ననాటి స్నేహితుడితో తాను ప్రేమలో ఉన్నాను త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నాను అంటూ క్లారిటీ ఇస్తూ హీరో విశాల్ తో రూమర్లకు చెక్ పెట్టేశారు.
ఇలా గత కొద్ది రోజుల క్రితం ఈమె తన ప్రేమ విషయాన్ని బయట పెట్టారు అయితే తాజాగా నిశ్చితార్థం కూడా జరుపుకున్నట్టు తెలుస్తుంది నిశ్చితార్థపు ఫోటోలను ఈమె షేర్ చేయకపోయినా తన కాబోయే భర్తతో కలిసి ఆలయంలో గంట కొడుతూ ఉన్న ఫోటోలను షేర్ చేశారు అయితే ఈ ఫోటోలో వారిద్దరి చేతి వేళ్లకు రింగులు కనిపించడంతో ఈమె ఎవరికీ తెలియకుండా నిశ్చితార్థం జరుపుకున్నారని స్పష్టమవుతుంది.
ఇలా ఈ ఫోటోని షేర్ చేసిన ఈమె త్వరలోనే ఒక కొత్త జీవితం ప్రారంభం కాబోతుందని క్యాప్షన్ ఇచ్చారు. ఇక ఎక్కడ కూడా అభినయ ఇప్పటివరకు తనకు కాబోయే భర్త ఫోటోలను మాత్రం షేర్ చేయలేదని చెప్పాలి. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవ్వడంతో ఎంతో మంది సెలబ్రిటీలు అభిమానులు అభినయ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.