వైసీపీకి వ్యతిరేకంగా సినిమా తీస్తా: నట్టికుమార్‌ ప్రకటన

రామ్‌గోపాల్‌ వర్మ ఒక డైరెక్టర్‌ అని.. వైసీపీ వాళ్లు డబ్బులిస్తే వ్యూహం సినిమా తీశాడని సినీ నిర్మాత కమ్‌ డైరెక్టర్‌ నట్టి కుమార్‌ పేర్కొన్నారు. డబ్బులిచ్చారు కాబట్టి వైసీపీపై వర్మకు సానుభూతి ఉంటుందన్నారు. కానీ సినిమాలు చూసి ప్రజలు ఓట్లు వేసే రోజులు పోయాయన్నారు. వ్యూహం సినిమా తాను చూస్తానని.. వెంటనే వైసీపీకి వ్యతిరేకంగా సినిమా తీస్తానని నట్టి కుమార్‌ తెలిపారు. ఎంపీ రఘురామ కృష్ణరాజుకు చిత్ర హింసలు, వివేకానందరెడ్డి మర్డర్‌ ఎలా జరిగింది? వైసీపీ అరాచకాలపై నేను సినిమాలు తీసి సమాధానం చెబుతా.

వివేకానంద మర్డర్‌ ఎందుకు చేశారో చెప్పలేని పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం ఎందుకు ఉంది. సినీ పరిశ్రమ మొత్తం టీడీపీ వైపు ఉంది. ప్రస్తుతం సినీ రంగం భయంతో ఉంది. త్వరలో టీడీపీకి మద్దతుగా అందరూ వస్తారు. రాష్ట్ర ప్రజల బాగు కోసం నేను టీడీపీకి సపోర్ట్‌ చేస్తున్నా. చంద్రబాబుని త్వరలో కలిసి నా ప్రత్యక్ష రాజకీయాలపై కార్యచరణ ప్రకటిస్తా.

విశాఖలో సినీ రంగానికి ప్రభుత్వ స్టూడియో నిర్మాణం కావాలని లోకేష్‌ని అడిగాను. సినిమా హబ్‌ గా విశాఖను తీసుకువస్తాం. టీడీపీ, జనసేనకి 130 నుంచి 150 సీట్లు వస్తాయి. వైసీపీ 29 సీట్లకు పరిమితమవుతుంది. కాపులపైన, రంగా పైన ప్రేమ ఉంటే నాలుగున్నరేళ్లలో అమర్నాథ్‌, పేర్ని నాని, అంబటి ఎందుకు విచారణ చేపట్టలేదని..ముద్రగడ పద్మనాభం ఎందుకు మాట్లాడలేదని నట్టి కుమార్‌ ప్రశ్నించారు.