కిడ్నీ దానం చేస్తానన్న అభిమాని.. కన్నీళ్లు పెట్టిన పంచ్ ప్రసాద్!

Panch Prasad: బుల్లితెర పై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్య క్రమంలో పాల్గొనే కంటెస్టెంట్ ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరందరూ ప్రతివారం మనల్ని నవ్వించడానికి నవ్వుతూ కనిపించినప్పటికీ వారి నవ్వు వెనక ఎన్నో కన్నీటి గాథలు ఉన్నాయి.ఈ క్రమంలోనే ఇప్పటికే ఎంతోమంది జబర్దస్త్ కమెడియన్స్ జబర్దస్త్ వేదికపై వారు ఎదుర్కొన్న చేదు అనుభవాలను కన్నీటి కష్టాలు గురించి వెల్లడించారు.ఇకపోతే జబర్దస్త్ కార్యక్రమంలో మరణం అంచుల దాకా వెళ్లి వచ్చిన కమెడియన్ ప్రసాద్ గురించి అందరికీ తెలిసిందే. ఈయన కిడ్నీ వ్యాధితో బాధపడుతూ బ్రతకడం కష్టమని డాక్టర్లు కూడా తెలిపారు. అలాంటి ప్రసాద్ ధైర్యంతో మరణం నుంచి బయటపడ్డారు.

ఇక ప్రసాద్ భార్య తనకు కిడ్నీ దానం చేస్తానని చెప్పినట్లు పంచ్ ప్రసాద్ పలుసార్లు తన భార్య తనకు తోడుగా ఉన్న విషయాన్ని వెల్లడించారు. ఇకపోతే తాజాగా ఈయనకి కిడ్నీ దానం చేస్తానని అభిమాని ముందుకు రావడంతో పంచ్ ప్రసాద్ ఎంతో ఎమోషనల్ అయ్యారు.ప్రతి ఆదివారం ఈటీవీలో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో జబర్దస్త్ కమెడియన్స్ పాల్గొని ప్రేక్షకులను సందడి చేస్తారు.ఈ క్రమంలోనే ఈ వారం ప్రసారం కాబోయే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు కమెడియన్స్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

YouTube video player

ఈ క్రమంలోనే కొందరు అభిమానులు పంచ్ ప్రసాద్ ను ప్రశ్నిస్తూ మీరు ఎప్పుడైనా మీకు ఉన్న కిడ్నీ వ్యాధి గురించి ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచించి బాధపడ్డారా? అలా బాధపడకండి మీకు కిడ్నీ అవసరమైతే ఇవ్వడానికి నేనున్నాను అంటూ అభిమాని వీడియో ద్వారా తన కిడ్నీ దానం చేయడానికి ముందుకు వచ్చారు. ఇక ఈ విషయం విన్న పంచ్ ప్రసాద్ ఎమోషనల్ అవుతూ ఇప్పటివరకు తాను ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఈ విషయం తలచుకుని బాధపడలేదు కాని ఇప్పుడు బాధగా ఉంది. నాకోసం కిడ్నీ దానం చేసే అభిమానులు కూడా ఉన్నారు అంటూ ఈయన ఎమోషనల్ అయ్యారు.అయితే నేను ఆ దేవుడిని ఒకటే కోరుకుంటాను నన్ను ఎంతగానో అభిమానించే మిమ్మల్ని మరికొన్ని రోజులపాటు నవ్వించడానికి తనని మరికొన్ని రోజులు బ్రతికించమని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను అంటూ ఈయన ఏమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ ప్రోమో ఎంతోమందిని కంటతడి పెట్టించింది.