Tanushree Dutta: హీరోయిన్ తనుశ్రీ దత్తా షేర్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఆ వీడియోలో కన్నీరు మున్నీరుగా విలవిస్తూ తనను రక్షించాలని కోరుకుంది సదరు హీరోయిన్. ఇంట్లోని వారు తనను వేధిస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో ఏడుస్తున్న వీడియోని షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది అన్న విషయానికి వస్తే… ఒకప్పటి హీరోయిన్ అయిన తను శ్రీ దత్త ఆ వీడియోలో మాట్లాడుతూ.. నా ఇంట్లోనే నన్ను వేధిస్తున్నారు.
పోలీసులకు ఫోన్ చేస్తే స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇవ్వమని చెప్పారు. రేపో, ఎల్లుండో పోలీసుల దగ్గరకు వెళ్తాను. గత నాలుగైదేళ్ల నుంచి ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను. నా ఇళ్ళు అంతా చిందరవందరగా అయిపోయింది. పనివాళ్లని పెట్టుకుంటే వాళ్ళు వచ్చి నా వస్తువుల్ని దొంగలిస్తున్నారు. నా ఇంట్లోనే నాకు భద్రత లేకుండా పోయింది. ఎవరైనా వచ్చి కాస్త నాకు సాయం చేయండి అంటూ ఏడుస్తూ తనుశ్రీ దత్తా వీడియో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ వీడియోని తెగ వైరల్ చేస్తూ పోలీసులను ట్యాగ్ చేస్తున్నారు.
https://www.instagram.com/reel/DMadBdbt-eE/?utm_source=ig_web_copy_link
అలాగే పలువురుసిని సెలబ్రిటీలను కూడా ట్యాగ్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇకపోతే తను శ్రీ దత్తా విషయానికి వస్తే.. బిహార్‌కి చెందిన తనుశ్రీ దత్తా.. 2004లో ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్ విజేతగా నిలిచింది. కానీ ఆషిక్ బనాయా అప్నే పాటతో ఈమెకు మంచి గుర్తింపు దక్కింది. తెలుగులోనూ 2005లో వీరభద్ర అనే మూవీలో నటించింది. తమిళంలో కూడా 2010లో తీరదు విలాయాట్టు పిళ్లై అనే చిత్రంలో నటించింది. ఇవి తప్పితే 2013 వరకు హిందీలోనే పలు చిత్రాలు చేసింది. తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైంది.
