Siddharth: స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్న టాలీవుడ్ హీరో.. అందరూ నన్నే ఏడిపిస్తారు అంటూ!

Siddarth: టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ గురించి మనందరికీ తెలిసిందే. తెలుగులో నటించినది కొన్ని సినిమాలే అయినప్పటికీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు సిద్ధార్థ్. ఈ హీరో నటించిన బొమ్మరిల్లు,నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి సినిమాలు భారీగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం హీరో సిద్ధార్థ్ అడపాదడపా సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే హీరో సిద్ధార్థ నటించిన లేటెస్ట్ మూవీ 3 BHK. ఇది సిద్ధార్థ్ 40వ సినిమా అన్న విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉంటే తాజాగా హైదరాబాద్‌ లో గురువారం ఈ సినిమా ట్రైలర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో సిద్దార్థ్ మాట్లాడుతూ స్టేజ్ పైన ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా హీరో సిద్దార్థ్‌ మాట్లాడుతూ.. నా తల్లిదండ్రులు కూడా 3 BHKలోనే ఉండేవారు. నటుడిగా నాకు ఇది 40వ సినిమా. 3BHK మూవీ చేస్తున్నానని చెప్పగానే నాన్న ముఖంలో సంతోషం కనిపించింది. ఒకరకమైన తృప్తి, ఒకింత గర్వం కనబడింది. ఈ సినిమాలో అందరూ నన్ను ఏడిపిస్తారు. ఇదొక ఎమోషనల్‌ సినిమా. ఈ మూవీ చేసినందుకు సంతోషంగా ఉంది.

3BHK (Tamil) - Official Trailer | Siddharth | Sarath Kumar | Sri Ganesh | Amrit Ramnath | Arun Viswa

నా తల్లిదండ్రులు నన్ను ఎంతగానో నమ్మారు. నా జీవితం బాగుండాలని వారు సంపాదించినదంతా ఖర్చు పెట్టారు. నన్ను నమ్మి ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన డైరెక్టర్‌ కు థాంక్యూ అంటూ కర్చీఫ్‌ తో కన్నీళ్లు తుడుచుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అలాగే హీరో సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇకపోతే హీరో సిద్ధార్థ్ నటించిన ఈ సినిమా కథ ఏంటి అన్న విషయానికొస్తే.. సొంత ఇల్లు అనేది ఎన్నో మధ్య తరగతి కుటుంబాల కల. మామూలు మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీ ఆ కల నెరవేర్చుకుందా? లేదా? దానికోసం ఏ చేశారన్నదే 3 BHK కథ. శరత్‌ కుమార్‌, దేవయాని, చైత్ర, యోగిబాబు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం జూలై 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.