R.K.Roja: సినీనటి మాజీ మంత్రి ఆర్కే రోజా పట్ల నగరి ఎమ్మెల్యే భాను ప్రకాష్ చేసిన వ్యాఖ్యలపట్ల తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. మహిళా అని కూడా చూడకుండా భాను ప్రకాష్ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఆమెను ఎంతో కించపరచడం మహిళా లోకమే తలదించుకునేలా ఉంది అంటూ వైసీపీ మహిళా నేతలందరూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే విషయం గురించి రోజా ఓ చానల్ తో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకున్నారు. తనపై నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు తీవ్రంగా తగిలాయని అన్నారు. రాజకీయాల్లో విమర్శలు సహజమే అయినా, వ్యక్తిగత జీవితంపై అర్ధన్గత ఆరోపణలు తీవ్రంగా కలచివేస్తాయని పేర్కొన్నారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా గతంలో తనకు ఎదురైన ఒక చేదు సంఘటన గురించి కూడా ఈమె అందరితో పంచుకున్నారు నేను నా కుమార్తె కొడుకుతో కలిసి దిగిన ఫోటోని కొంతమంది మార్ఫింగ్ చేస్తూ న్యూడ్ ఫోటోలను తన కొడుకుకు పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు.ఆ దృశ్యాలను చూసినప్పుడు నేను సూసైడ్ చేసుకోవాలనుకున్నా. ఆ స్థితిలో నా కుటుంబం, నా ఆత్మవిశ్వాసమే నాకు అండగా నిలిచాయి,’ అంటూ బోరున ఏడ్చారు.
ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నది ఎవరైనా సరే వారి పట్ల చర్యలు తీసుకోవాలని ఈమె డిమాండ్ చేశారు.తనపై జరిగిన దుష్ప్రచారాలకు టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ బాధ్యత వహించాలన్నారు. ‘వారు ఇలా చేయించకుండా ఉంటే ఎవ్వరూ ఇంత దారుణంగా ప్రవర్తించరు. ఇవన్నీ రాజకీయాల్లో వ్యక్తిగతంగా నన్ను కించపరచే కుట్రలే,’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రోజా గురించి టిడిపి ఎమ్మెల్యే భాను ప్రకాష్ చేస్తున్న వ్యాఖ్యలను పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తోంది.
