మలయాళంలో హిస్టరీ క్రియేట్ చేసిన “2018” వసూళ్లు.!

జస్ట్ మౌత్ టాక్ తోనే కొన్ని సినిమాలు సెన్సేషనల్ విజయాన్ని నమోదు చేస్తాయి. మరి అలాంటి చిత్రాలు చాలా రేర్ గానే వస్తాయి కానీ వచ్చాక ఇచ్చే ఇంపాక్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మరి అలా గత ఏడాదిలో కన్నడ నుంచి “కాంతారా” అనే సినిమా రాగ అది ఒరిజినల్ కన్నడ హిట్ తోనే నెక్స్ట్ లెవెల్ రీచ్ ని అందుకుంది.

ఇక ఈ ఏడాది ఇదే రీతిలో సెన్సేషనల్ మౌత్ టాక్ తో వచ్చిన చిత్రమే “2018”. అయితే ఇది మలయాళ ఇండస్ట్రీ కి చెందింది కాగా ఈ చిత్రం ఈ సినిమా అయితే అనూహ్య విజయాన్ని వరల్డ్ వైడ్ గా అందుకుంది. కాగా ఈ చిత్రం అయితే రిలీజ్ అయ్యాక రికార్డు వసూళ్లు అందుకున్న ఈ సినిమా లేటెస్ట్ గా అయితే ఇన్నేళ్ల సినిమా కెరీర్ లో అయితే మలయాళ సినిమా నుంచి మొట్టమొదటి 200 కోట్ల గ్రాస్ అందుకున్న సినిమాగా 2018 ఇపుడు హిస్టరీ క్రియేట్ చేసింది.

దీనితో వారి ఇండస్ట్రీ కి కూడా ఒక 200 కోట్ల సినిమా దక్కినట్టు అయ్యింది అని చెప్పాలి. కాగా దీనికి ముందు అయితే మోహన్ లాల్ నటించిన “పులిమురుగన్” చిత్రం 180 కోట్లకి పైగా వసూళ్లతో అయితే నిలిచింది. మరి మలయాళంలో అయితే మళ్ళీ రేంజ్ హిట్ ఎప్పుడు వస్తుందో అనేది సస్పెన్స్ అనే చెప్పాలి.

మన తెలుగు తమిళ కన్నడ మార్కెట్ తో పోలిస్తే ఎందుకో మలయాళంలో బాక్సాఫీస్ తక్కువగానే ఉంటుంది. కానీ కంటెంట్ పరంగా మాత్రం వారే ముందుంటారు. మొత్తానికి అయితే 2018 అనే సర్వైవల్ థ్రిల్లర్ వారికి కూడా ఒక 200 కోట్ల సినిమాని అందించింది. కాగా ఈ చిత్రాన్ని జూడే అంథోని జోసెఫ్ దర్శకత్వం వహించారు.