బ్రేకింగ్ : ఇండియా తరుపున 2024 ఆస్కార్ కి ఈ మలయాళ హిట్ సినిమా 

గత ఏడాది ఇండియన్ సినిమా దగ్గర వచ్చిన మన టాలీవుడ్ సెన్సేషన్ హిట్ సినిమా ట్రిపుల్ ఆర్(RRR) అందుకున్న ఎన్నో ఘనతలలో ఇండియన్ సినిమాకి ఎప్పుడు నుంచో దూరంగా ఉన్న ఆస్కార్ అవార్డు కూడా ఒకటి. మరి ఈ సినిమాకి గాను నాటు నాటు సాంగ్ కి మొట్ట మొదటి ఆస్కార్ అవార్డు ఇండియన్ సినిమా దగ్గర వచ్చింది.

కాగా దీనితో ఇండియా నుంచి ఇక వేసరికి వారే ఆస్కార్ అవార్డు కి నామినేషన్స్ లు తాను పంపేయడం వంటివి స్టార్ట్ చేస్తున్నారు. అయితే మొదట ఇండియా ఫెడరేషన్ వారికి తమ సినిమాలని పంపడం లేదా వారే కొన్ని చిత్రాలు ఎంపిక చేసి ఆస్కార్ కి పంపుతారు. అయితే ఇది గతంలో RRR సినిమాకి చేదు అనుభవంగా మారింది.

దీనితో నేరుగా సినిమా యూనిట్ నే తమ సినిమాని పంపుకున్నారు. కానీ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా ఇండియన్ ఫెడరేషన్ వారు అయితే బిగ్ అప్డేట్ ని అందించారు. ఈ ఏడాది మలయాళ సినిమా దగ్గర సెన్సేషనల్ హిట్ అయ్యిన “2018” మూవీని ఆస్కార్ ఎంట్రీ కి తాము తీసుకున్నట్టుగా తెలిపారు. దీనితో ఈ వార్త ఇండియా వైడ్ గా ఆసక్తిగా మారింది.

ఈ ఎమోషనల్ సర్వైవల్ థ్రిల్లర్ ఆస్కార్ ఎంట్రీ తగినదే అని చాలా మంది కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ చిత్రంలో నటుడు టోవినో థామస్, అపర్ణ బాలమురళి తదితరులు నటించగా జూడే అంథోని దర్శకత్వం వహించారు. మరి ఆస్కార్ జ్యురీ లో సినిమా వెలుగుతుందో లేదో కొన్నాళ్ళు ఆగి చూడాల్సిందే.