Unni Mukundan: క్షమించండి.. ఆ సినిమా సీక్వెల్ చేయడం లేదు.. ఉన్ని ముకుందన్ కామెంట్స్ వైరల్!

Unni Mukundan: మలయాళీ నటుడు ఉన్ని ముకుందన్ గురించి మనందరికీ తెలిసిందే. ఈయన పలు సూపర్ హిట్ సినిమాలలో నటించి నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు. ముకుందన్ నటించిన సినిమాలలో మార్కో సినిమా కూడా ఒకటి. ఈ సినిమా విడుదల అయ్యి సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా మంచి సక్సెస్ అవడంతో ఈ సినిమాకు తప్పకుండా సీక్వెల్ ఉంటుందని అభిమానులు అందరూ భావించారు. అయితే ఈ సినిమా సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్న వారికి తాజాగా హీరో ఉన్ని ముకుందన్ ఒక ఊహించని షాక్ ఇచ్చారు.

తాజాగా ఈ సినిమా సీక్వెల్‌ ను ఉద్దేశించి ఉన్ని ముకుందన్‌ ఒక కీలక ప్రకటన చేశారు. మార్కో 2 సినిమా ఎప్పుడు ఉంటుంది అంటూ ఒక నెటిజన్ ఇన్‌స్టా వేదికగా కామెంట్‌ చేయగా ఆయన వెంటనే స్పందించారు. ‘‘క్షమించండి.. మార్కో సినిమాకు కొనసాగింపుగా పలు ప్రాజెక్ట్‌ లు చేయాలనే ఆలోచనను విరమించుకున్నాను.. ఆ ప్రాజెక్ట్‌ పై ఎంతో వ్యతిరేకత వచ్చిన కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నాను. మార్కో కంటే భారీ, ఉత్తమ చిత్రాలను మీకు అందించడం కోసం నేను శ్రమిస్తుంటాను అని ఉన్ని ముకుందన్ చెప్పుకొచ్చారు. దీంతో అభిమానుల ఆశలపై కాస్త నీరు చల్లినట్లు అయ్యింది.

ఇకపోతే మార్కో సినిమా విషయానికి వస్తే.. హనీఫ్ దర్శకత్వం వహించిన మార్కో మూవీ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. హింసకు పరాకాష్ట అనిపించే సరికొత్త సన్నివేశాలతో సాగే కథ. డబ్బు ఉన్న ఒక పెద్ద కుటుంబం వ్యాపార సామ్రాజ్యం శత్రువులు వీరి మధ్యలో ఒక పెంపుడు వారసుడు అనేది ఈ సినిమా యొక్క నేపథ్యం. ఈ సినిమా గత వీడాది డిసెంబర్లో విడుదల అయ్యి మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. దాదాపుగా 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన సాధించింది. ఈ మలయాలి సినిమాను తెలుగులో కూడా విడుదల చేయగా అక్కడ కూడా మంచిగా రెస్పాన్స్ వచ్చింది.