Eye Tips: సాధారణంగా చలికాలంలో చాలామంది కళ్ళు తొందరగా పొడిబారి ఎర్రగా మారుతూ ఉంటాయి. చలికి కారణంగా కళ్ళు ఎర్ర పడినప్పటికీ చాలామందిలో మంటలు రావడం, సరిగా చూపు కనిపించకపోవడం వంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఈ విధంగా కళ్ళు ఎర్రబడ్డాయి అంటే ఎవరూ కూడా ఆలస్యం చేయకుండా డాక్టర్లను సంప్రదించడం మంచిది. అంతేకాకుండా కళ్ళు పొడి బారకుండా కొన్ని జాగ్రత్తలను కూడా తీసుకోవాలి.
కళ్ళు పూర్తిగా పొడి బారినప్పుడే ఎర్రగా మారుతాయి అందుకే కళ్ళను ఎప్పుడు తేమగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. కళ్ళు తేమగా ఉండటం కోసం మార్కెట్లో మనకు లభించే కృత్రిమ కన్నీటిని ప్రతిరోజు ఉదయం సాయంత్రం రెండు చుక్కలు కళ్ళల్లో వేసుకోవటం వల్ల కళ్ళుపొడి బారకుండా తేమగా ఉంటాయి. వీటితోపాటు మనం ఎక్కువగా చల్లగాలికి గురి కాకుండా అదే విధంగా సూర్యకాంతి మనపై పడకుండా ఉండాలి.
చలికాలంలో బయటకు వెళ్లిన ప్రతిసారి కళ్ళకు రక్షణ కల్పించుకొని వెళ్లాలి అంటే మంచి సన్ గ్లాసెస్ పెట్టుకొని వెళ్లడం వల్ల సూర్య కాంతి నేరుగా మన కళ్ళపై పడదు. అదేవిధంగా దుమ్ము ధూళి కూడా కళ్ళల్లో పడదు. ఇకపోతే మన శరీరం డిహైడ్రేషన్ కాకుండా ఉన్నప్పుడే కళ్ళు కూడా పొడిబారవు అందుకే తరచూ నీటిని తాగుతూ ఉండాలి. వీటితోపాటు తగినంత నిద్ర కూడా ఎంతో అవసరం. మనకు సుమారు 7 నుంచి 8 గంటల పాటు నిద్ర ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి సమస్యలు అనేవి తలెత్తవు. కళ్ళు ఎప్పుడైతే ఇలా తేమను కోల్పోయి ఉంటాయో అలాంటి సమయంలో మొబైల్ ఫోన్ టీవీ వంటి వాటిని కూడా పూర్తిగా పక్కన పెట్టేయడం వల్ల కంటిని మనం కాపాడుకోవచ్చు.