మీ ముఖ సౌందర్యానికి మెడ చుట్టూ ముడతలు ఇబ్బందిగా మారాయా…. ఈ సహజ చిట్కాలను పాటించండి!

కొందరిలో అతి చిన్న వయస్సులోని మెడ కింది భాగంలో ముడతలు ఏర్పడి ముఖ సౌందర్యానికి అడ్డంకిగా మారుతుంటాయి. ఈ సమస్య నుంచి బయటపడడానికి మార్కెట్లో దొరికే ఏవేవో బ్యూటీ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తూ డబ్బును కాలాన్ని వృధా చేసుకున్నప్పటికీ ఎలాంటి ఫలితం లభించకపోగా మరెన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. చర్మంపై ముడతలు ఏర్పడడానికి పోషకాహార లోపం, వాతావరణ కారణాలు, ఆరోగ్య సమస్యలు ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు. మెడ కింది భాగంలో ముడతలను తగ్గించుకోవడానికి ఇప్పుడు చెప్పబోయే సహజ చిట్కాలను పాటిస్తే సులువుగా సహజ పద్ధతిలో ముఖ సౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చు.

మెడ కింద నల్లని వలయాలు ముడతల సమస్యతో బాధపడేవారు టేబుల్ స్పూన్ అలివ్ నూనె తీసుకొని అందులో టేబుల్ స్పూన్ తేనె కొన్ని చుక్కల గ్లిజరిన్ కలిపి ఈ మిశ్రమాన్ని వారంలో ఒకటి లేదా రెండు సార్లు మెడకింది ముడతలపై మర్దన చేసుకుంటే అలీవ్ నూనె, తేనెలో ఉండే సహజ యాంటీ ఆక్సిడెంట్, విటమిన్ ఏ, విటమిన్ ఈ శరీరంలో ఫ్రీ రాడికల్స్ ను తగ్గించి చర్మంపై ఏర్పడే ముడతలు నల్లని వలయాలను తగ్గించడమే కాకుండా వృద్ధాప్య ఛాయాలను అరికడతాయి.

విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉండే అరటిపండు చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.ఇందుకోసం బాగా పండిన అరటిపండును మెత్తటి గుజ్జుగా మార్చుకొని చర్మంపై ఉండే మడతలపై మర్దన చేసుకుంటే చర్మంపై ఉండే మృత కణాలను తొలగించే కొల్లాజన్ ఉత్పత్తిని పెంపొందిస్తుంది. తద్వారా చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది. యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్న తేనెను మెడ చుట్టూ ఉన్న ముడతలపై మర్దన చేసుకుని చర్మం బిగుతుగా అయ్యేదాకా ఉంచి చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి తర్వాత మార్చరైజ్ రాసుకుంటే మెడపై ఉండే ముడతలు తగ్గిపోతాయి. చర్మ సంరక్షణకు సహాయపడే అమినో యాసిడ్స్ బాదం ఆ ఇల్లు మెండుగా ఉన్నాయి కావున బాదం నూనెను మర్దన చేసుకుంటే సున్నితమైన మృదువైన చర్మాన్ని పొందవచ్చు.