మెడ చుట్టూ ముడతలు అందవిహీనంగా కనిపిస్తున్నాయా… ఈ చిట్కాలను పాటించండి!

సాధారణంగా అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అయితే కొన్నిసార్లు కొందరిలో కొన్ని కారణాలవల్ల వారి శరీర సౌష్టవం కారణంగా అందవిహీనంగా కనిపిస్తూ ఉంటారు.కొందరిలో అతి చిన్న వయస్సులోని మెడ కింది భాగంలో ముడతలు ఏర్పడి ముఖ సౌందర్యానికి  ఇబ్బందిగా మారుతుంది. ఇలా మెడ చుట్టూ ముడతలు ఉండటం వల్ల ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే ఈ సమస్య నుంచి బయట పడాలంటే ఈ సింపుల్ చిట్కాలను పాటిస్తే చాలు మెడ చుట్టూ ఉన్నటువంటి ముడతలను తొలగించుకోవచ్చు.

 

ఇలా చర్మంపై ముడతలు ఏర్పడడానికి పోషకాహార లోపం, వాతావరణ కారణాలు, ఆరోగ్య సమస్యలు ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు. మెడ కింది భాగంలో ముడతలను తగ్గించుకోవడానికి టేబుల్ స్పూన్ అలివ్ నూనె తీసుకొని అందులో టేబుల్ స్పూన్ తేనె కొన్ని చుక్కల గ్లిజరిన్ కలిపి ఈ మిశ్రమాన్ని వారంలో ఒకటి లేదా రెండు సార్లు మెడకింది ముడతలపై మర్దన చేసుకుంటే  అలీవ్ నూనె, తేనెలో ఉండే సహజ యాంటీ ఆక్సిడెంట్, విటమిన్ ఏ, విటమిన్ ఈ శరీరంపై ఉన్నటువంటి మడతలు మచ్చలను తొలగించడానికి దోహదం చేస్తుంది.

 

విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉండే అరటిపండు చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.ఇందుకోసం బాగా పండిన అరటిపండును మెత్తటి గుజ్జుగా మార్చుకొని చర్మంపై ఉండే మడతలపై మర్దన చేసుకుంటే చర్మంపై ఉండే మృత కణాలను తొలగించే కొల్లాజన్ ఉత్పత్తిని పెంపొందిస్తుంది. తద్వారా చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది.  చర్మ సంరక్షణకు సహాయపడే అమినో యాసిడ్స్ బాదం ఆ ఇల్లు మెండుగా ఉన్నాయి కావున బాదం నూనెను మర్దన చేసుకుంటే సున్నితమైన మృదువైన చర్మాన్ని పొందవచ్చు.