ఎర్ర కలబంద గుజ్జుతో ఇలా చేస్తే చర్మ సమస్యలకు చెక్ పెట్టవచ్చు..!

what-are-the-benefits-of-aloe-vera

అలోవెరా (కలబంద) మొక్క గుజ్జులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మనందరికీ ఈ మొక్కలో ఉన్న సుగుణాల గురించి తెలిసే ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యం పొంది ఎంతో ప్రత్యేకంగా కనిపించే రెడ్ అలోవెరా (ఎర్ర కలబంద) మొక్కలో సాధారణ కలబంద మొక్క కంటే అదనపు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎర్ర కలబంద మొక్కలో
శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్, అమినోయాసిడ్స్ , పాలీశాకరైడ్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీబయోటిన్ గుణాలు సమృద్దిగా లభిస్తాయి

రెడ్ అలోవెరా మొక్కల్లో ఉన్న గుజ్జును సౌందర్య ఉత్పత్తుల్లో ఎక్కువగా వినియోగిస్తున్నారు.చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో వీటి పాత్ర
కీలకమనే చెప్పొచ్చు. చర్మం పై ముడతలు, వృద్ధాప్య లక్షణాలతో బాధపడేవారు వారంలో మూడుసార్లు కలబంద గుజ్జుతో ఫేషియల్ చేసుకుంటే కలబంద లో ఉండే సహజ యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఏజింగ్ గుణాలు చర్మ కణాలకు నూతన శక్తిని పెంపొందించి చర్మ సౌందర్యాన్ని మెరుగుపరిచి ముఖంపై ముడతలు తగ్గించడమే కాకుండా చిన్న వయసులో వచ్చే వృద్ధాప్య చాయాలను అరికడతాయి.

రెడ్ అలోవెరా గుజ్జులో యాంటీ ఫంగల్, యాంటీ సెప్టిక్ గుణాలు ముఖంపై వచ్చే మొటిమలు, నల్ల మచ్చలను తగ్గించి చర్మాన్ని మృదువుగా ఉంచడంలో సహాయపడతాయి. అలాగే కలబంద గుజ్జుతో కొబ్బరి నూనెను కలిపి తల చర్మానికి జుట్టు కుదురులకు అంటే విధంగా మర్దన చేసుకుంటే గుజ్జులో ఉండే యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చుండ్రు సమస్యను తగ్గించి జుట్టు అందాన్ని, రెట్టింపు చేయడంలో సహాయపడతాయి.

ప్రతిరోజు కలబంద గుజ్జును తీసి శుభ్రపరచుకొని అందులో నిమ్మరసం, తేనె కలుపుకొని సేవిస్తే చెడు కొలెస్ట్రాల్ తొలగి ఉబకాయ సమస్య తగ్గుతుంది. రక్తంలో చక్కెర నిల్వలు తగ్గి డయాబెటిస్ వ్యాధికి పెట్టవచ్చు. రక్త ప్రసరణ వ్యవస్థ లోపాలు తొలగి రక్తపోటు గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది. రెడ్ అలోవెరా మొక్క జ్యూస్ సేవించాలనుకుంటే మొదట నిపుణుల అభిప్రాయం తీసుకోవడం మర్చిపోవద్దు.