గర్భిణీ స్త్రీలు అస్సలు తినకూడని పండ్లు ఇవే.. ఈ పండ్లు తింటే మాత్రం ఇంత ప్రమాదమా?

గర్భిణీ స్త్రీలు తీసుకునే ఆహారం విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆహారం విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశాలు ఉంటాయి. అయితే గర్భిణీ స్త్రీలు అస్సలు తినకూడని పండ్లు కొన్ని ఉన్నాయి. ఆ పండ్లు తినడం వల్ల గర్భిణీ స్త్రీల ఆరోగ్యం ప్రమాదంలో పడే అవకాశాలు అయితే ఉంటాయి.

గర్భిణీ స్త్రీలు ద్రాక్ష పండ్లను తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఒకవేళ ద్రాక్ష పండ్లను తినాలనుకుంటే వైద్యుల సలహాలు తీసుకుని ఆ పండ్లను తింటే మంచిది. కొవ్వు ఎక్కువగా ఉండే అవకాడో కూడా గర్భిణీ స్త్రీలకు మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. పాషన్ ఫ్రూట్ కూడా గర్భంతో ఉన్న మహిళలకు హాని చేస్తుంది. ఈ పండ్లు తినడం అసిడిటీ సమస్య వేధించే అవకాశం అయితే ఉంటుంది.

గర్భిణీ మహిళలు జాక్ ఫ్రూట్ కు కూడా దూరంగా ఉండాలి. ఈ పండ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. మామిడి పండ్లను తీసుకోవడం గర్భిణీ స్త్రీలకు మంచిది కాదు. ఈ పండు గర్భాశయ సంకోచాలకు కారణమవుతుంది కాబట్టి ఈ పండును తీసుకోకుండా ఉంటే మంచిది. పైనాపిల్ వల్ల కూడా ఇదే సమస్య ఉంటుంది కాబట్టి ఈ పండ్లు కూడా గర్భిణీ స్త్రీలకు మంచివి కావు.

బొప్పాయి వల్ల అబార్షన్ అయ్యే ప్రమాదం ఉండగా పుచ్చకాయ వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉండటంతో ఈ పండ్లు కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. పండ్లను ఎక్కువగా తినే గర్భిణీ స్త్రీలు ఈ విషయాలను గుర్తుంచుకుంటే మంచిది. తినే పండ్ల విషయంలో వైద్యులు సలహాలు, సూచనలు తీసుకుంటే ప్రయోజనాలు చేకూరుతాయి.