వేళ్లు విరుచుకోవడం వల్ల ఇన్ని నష్టాలా.. పదేపదే అలా చేస్తే ఆరోగ్యానికే ప్రమాదమా?

మనలో చాలామంది తరచూ వేళ్లను విరవడం అలవాటుగా చేసుకుని ఉంటారు. అయితే ఈ అలవాటు ఆరోగ్యకరమైన అలవాటు మాత్రం కాదని వైద్య నిపుణులు చెబుతుంటారు. వేళ్లను విరవడం వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయని చెప్పవచ్చు. వేళ్లను విరిచే అలవాటు ఉన్నవాళ్లు ఆ నష్టాల గురించి తప్పనిసరిగా అవగాహన కలిగి ఉంటే మంచిదని చెప్పవచ్చు. మన చేతివేళ్లలో సైనోవియల్ అనే ద్రవం ఉంటుంది.

వేళ్లు విరిచిన సమయంలో ఈ ద్రవంలోని బుడగలు పగిలిపోవడం వల్ల శబ్దం వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. వేళ్లను తరచూ విరుచుకోవడం వల్ల అది కీళ్లపై ప్రభావం చూపే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ సమస్య విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే పెద్ద సమస్య బారిన పడే ఛాన్స్ అయితే ఉంటుంది. చేతి వేళ్లను తరచూ విరిస్తే కీళ్లలో లూబ్రికేషన్ తగ్గిపోతుంది.

ఈ సమస్య వల్ల కొన్నిసార్లు అర్థరైటిస్ బారిన పడే అవకాశాలు అయితే ఉంటాయి. వేళ్లను తరచూ విరుచుకోవడం వల్ల ఎముకల్లో పగుళ్లు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఎముక సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతోంది. వేళ్లు విరవడం చేతులలో పట్టు బలహీనపడి కొన్నిసార్లు వాపు, నొప్పి, ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

కొన్ని అధ్యయనాలు వేళ్లు విరవడం వల్ల ఎలాంటి సమస్య ఉండదని చెబుతున్నా ఈ సమస్య విషయంలో నిర్లక్ష్యంగా ఉండటం మాత్రం మంచిది కాదు. ఇప్పటికే ఈ అలవాటును కలిగి ఉన్నవాళ్లు వీలైనంత వేగంగా ఈ అలవాటును మార్చుకుంటే మంచిదని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని చెప్పవచ్చు.