మనలో చాలామందికి తరచూ చేతి వేళ్ళను విరిచే అలవాటు ఉంటుంది. ఎప్పుడో ఒకసారి చేతి వేళ్ళను విరిస్తే నష్టం లేదు కానీ తరచూ ఈ పని చేస్తే మాత్రం దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు అయితే ఉంటాయి. తరచుగా వేళ్ళు విరవడం వల్ల కీళ్ల నొప్పులు, వదులుగా ఉండే కీళ్ళు, వేళ్ళలో వాపు, నరాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కొంతమందిలో, ఇది చేయకూడదని హెచ్చరించినా, కొంతమందికి అలవాటుగా మారిపోతుంది. అయితే, నిపుణులు వేళ్ళు విరవడం వల్ల ఎటువంటి ప్రమాదం ఉండదని, కానీ తరచుగా విరిస్తే కీళ్ల చుట్టూ ఉండే కణజాలానికి గాయాలు కావచ్చునని చెబుతున్నారు.
వేళ్ళు విరవడం వల్ల కీళ్ళ చుట్టూ ఉండే కణజాలం దెబ్బతింటుంది, దీనివల్ల కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. తరచుగా వేళ్ళు విరవడం వల్ల కీళ్ళు వదులుగా మారిపోతాయి. వేళ్ళను విరవడం వల్ల వాపు, మంట వచ్చే అవకాశం ఉంది. కొంతమందిలో, వేళ్ళు విరవడం వల్ల నరాల మీద ఒత్తిడి పడి, తిమ్మిర్లు లేదా నొప్పి వచ్చే అవకాశం ఉంది. వేళ్ళు విరవడం అలవాటుగా మారిన వారిలో పట్టు బలహీనపడే అవకాశం ఉంది.
కొందరికి, తరచుగా వేళ్ళు విరవడం వల్ల చికాకుగా అనిపించవచ్చు. వేళ్ళు విరవాలనిపించినప్పుడు, మీ దృష్టిని మరొక పని మీదకు మళ్ళించండి. ఉదాహరణకు, ఏదైనా పుస్తకం చదవడం లేదా నడవడం చేయవచ్చు.వేళ్ళను బలంగా పట్టుకోవడం, వదలడం వంటి వ్యాయామాలు చేయడం వల్ల వేళ్ళకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, దీంతో వేళ్ళు విరవడం తగ్గవచ్చు.
ఒత్తిడి వల్ల కూడా వేళ్ళు విరవడం అలవాటుగా మారే అవకాశం ఉంది. కాబట్టి, ఒత్తిడిని తగ్గించుకునేందుకు ప్రయత్నించండి. ఒకవేళ మీరు వేళ్ళు విరవడం అలవాటును మానుకోలేకపోతే, వైద్యుడిని సంప్రదించడం మంచిది. చేతి వేళ్ళలో సైనోవియల్ ద్రవం ఉంటుంది. వేళ్ళు విరిచిన సమయంలో ఆ ద్రవం వాళ్ళ శబ్దం వస్తుంది. చేతి వేళ్ళను విరవడం వాళ్ళ లూబ్రికేషన్ తగ్గిపోయి కొత్త సమస్యలు తలెత్తుతాయి.