అరటి పండు ఎందుకు వంకరగా ఉంటుంది… దీని వెనుక కారణం ఏంటో తెలుసా?

bananas-1354785_1920

అతి తక్కువ ధరలో సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండే పనులలో అరటిపండు ఒకటి. ఈ అరటిపండు వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందువల్ల ప్రతిరోజు ఒక అరటిపండు తప్పనిసరిగా తినాలని డాక్టర్లు సూచిస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా సాధారణంగా అన్ని రకాల పండ్లు గుండ్రంగా ఉంటాయి. కానీ అరటిపండు మాత్రం పొడవుగా వంకర తిరిగి ఉంటుంది. అన్ని పండ్ల లాగా అరటిపండు గుండ్రంగా ఉండకుండా ఇలా పొడవుగా వంకర తిరిగి ఉండటానికి గల రహస్యం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

 

సాధారణంగా అన్ని పండ్ల లాగే అరటి పండ్లు కూడా భూమి లోపల కాకుండా చెట్టు మీద పెరుగుతాయి. అరటి చెట్టుకి మొదట అరటి పువ్వు వస్తుంది. ఆ తర్వాత ఆ పువ్వుల రేకల కింద చిన్న అరటి పండ్ల వరుసలు పెరగడం ప్రారంభమవుతు అరటి గెల తయారవుతుంది. అయితే అరటి పండు పెరిగే సమయంలో.. నెగెటివ్ జియోట్రోపిజం అనే ప్రక్రియ జరుగుతుంది. నెగెటివ్ జియోట్రోపిజం అంటే

సాధారణంగా భూమికి ఉన్న ఆకర్షణ శక్తి వల్ల ఏ వస్తువునైనా తనవైపు లాక్కుంటూ ఉంటుంది. దాన్ని మనం భూమి ఆకర్షణ శక్తి అని అంటాం.

 

అయితే అరటి పండ్లు మాత్రం భూమి ఆకర్షణ శక్తికి లొంగకుండా ఆకర్షణ శక్తికి విరుద్ధంగా ఆకాశంవైపు తిరుగుతాయి. ఎందుకంటే అరటి పండ్లు సూర్యకాంతి ఎటు ఉంటే అటు పెరుగుతాయి. అందువల్ల సూర్యరశ్మిని గ్రహించేందుకు అరటిపండ్లు పైకి పెరిగేందుకు ప్రయత్నిస్తాయి. పైగా అరటి ఆకులు వెడల్పుగా ఉండటంవల్ల వాటికి సూర్యరష్మి సరిగా లభించదు. ఈ క్రమంలో సూర్య రష్మి కోసం పైకి ఎగబాకుతూ అవి వంకరగా తిరుగుతాయి.  ఇలా సూర్యకాంతి కోసం అరటి పండ్లు భూమి ఆకర్షణకు విరుద్ధంగా పైకి తిరగటం వల్ల అవి కొంచెం వంకరగా ఉంటాయి.