జిమ్ కు వెళ్లకుండానే బరువు తగ్గాలని భావిస్తున్నారా.. ఈ చిట్కాలు పాటిస్తే చాలట!

ప్రస్తుత కాలంలో మనలో చాలామంది ఎన్నో ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు పడుతున్నారు. మనం తీసుకునే ఆహారం, జీవన శైలి ఆరోగ్యంపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతున్నాయి. జిడ్డుగల ఆహారాలు, తీపి వంటకాలను మనలో చాలామంది ఎంతో ఇష్టంతో తింటారు. ఎక్కువగా ఈ వంటకాలను తినడం వల్ల బరువు పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. అయితే వాము నీటిని రోజూ తీసుకుంటే జిమ్ కు వెళ్లకుండా బరువు తగ్గొచ్చు.

అధిక బరువు సమస్య వల్ల దేశంలో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. వెల్లుల్లిని రోజూ తీసుకోవడం ద్వారా లోబీపీ, జలుబుతో బాధపడేవారికి ఉపశమనం లభించే అవకాశాలు అయితే ఉంటాయి. నడుము చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించే సామర్థ్యం వెల్లుల్లికి ఉంటుంది. విటమిన్ బి 6, విటమిన్ సి , ఫైబర్, మెగ్నీషియం, కాల్షియం, ప్రోటీన్ ఎక్కువగా ఉండే వెల్లుల్లి మనిషి బరువును సులువుగా తగ్గిస్తుంది. జీర్ణాశయంలోని ఎంజైములను ఉత్తేజపరచడంలో ఇది సహాయపడుతుంది.

జీర్ణమైన ఆహారంలోని కొవ్వును వెల్లుల్లి ప్రొసెస్‌ చేయడంతో పాటు అనవసరమైన కొవ్వును శరీరం నుంచి బయటకు పంపిచేయటంలో ఉపయోగపడుతుంది. నాడీ వ్యవస్థను ఉత్తేజితం చేసి శరీర జీవక్రియ బాగా జరిగేట్టు చేసి క్యాలరీలను కరిగించటంలో వెల్లుల్లి ఎంతగానో సహాయపడుతుంది. వెల్లుల్లిలో ఉండే అలిసిన్ కొవ్వును అత్యంత వేగంగా కరిగిస్తుందని చెప్పవచ్చు.

ప్రతి రోజు ఉదయం పరగడుపున వీటిని తీసుకుంటే మంచిది. రోజుకి రెండు లేదా మూడు వెల్లుల్లి రేకలను మాత్రమే తినడం ద్వారా మాత్రమే హెల్త్ బెనిఫిట్స్ ను పొందవచ్చు. వెల్లుల్లి తీసుకోవడం ద్వారా కీళ్ల నొప్పులు, గుండె సమస్యలు, అల్జీమర్స్ వంటి సమస్యలు సైతం దూరమయ్యే అవకాశాలు ఉంటాయి. వెల్లుల్లిలో సల్ఫర్ ఎక్కువగా ఉన్నందున చిన్న పిల్లలకు తక్కువ మోతాదులో ఇవ్వాలి.