ఈ మొక్కతో ముత్యాల్లా మెరిసే పళ్ళు మీ సొంతం చేసుకోండి?

ప్రస్తుత కాలంలో మారుతున్న జీవన విధానం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అలా అందరిని ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న సమస్యలలో దంతాల సమస్యలు కూడా ముఖ్యమైనవిగా చెప్పవచ్చు. చిన్న పెద్ద అని వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరిలోనూ ఈ మధ్యకాలంలో దంతాల సమస్యలు అధికమవుతున్నాయి. ముఖ్యంగా ప్రతిరోజు బ్రష్ చేసినా కూడ కొంతమందిలో దంతాలు పసుపు రంగులో ఉంటాయి. ఇలా దంతాలు పసుపు రంగులో ఉండటం వల్ల నలుగురిలో ఉన్నప్పుడు స్వేచ్ఛగా మాట్లాడటానికి, నవ్వటానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా దంతాలు పసుపు రంగులో ఉండటానికి చాలా కారణాలు ఉన్నాయి.

అయితే సరైన పద్ధతిలో నోటిని శుభ్రపరుచుకోవటం వల్ల దంతాల సమస్యలు తగ్గుముఖం పడతాయి. ముఖ్యంగా పసుపు రంగు దంతాలతో బాధపడే వారికి ఒక మొక్క ఉపశమనాన్ని ఇస్తుంది. అకాసియా అనే మొక్క దంతాల సమస్యలు తగ్గించడమే కాకుండా పసుపు రంగులో ఉన్న దంతాలను తెల్లగా మార్చడంలో ఎంతో ఉపయోగపడుతుంది.ఈ అకాసియా మొక్కను ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తారు. ఈ మొక్క చిగుళ్ళు వాపు తగ్గించి దంతాలను బలోపేతం చేసి దంతాలు తెల్లగా మెరిసేలా చేస్తుంది. అయితే ఈ మొక్కను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

అకాసియా మొక్కని నల్లతుమ్మ చెట్టు అని కూడా అంటారు. ఈ మొక్కలోని బెరడు, గమ్, ఆకులు, గింజలు, కాయలు శక్తివంతమైన ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఈ మొక్కలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, యాంటిహిస్టామినిక్, యాంటీ హెమోస్టాటిక్ లక్షణాలతోపాటు.. విటమిన్లు, ఖనిజాలు కూడా ఉంటాయి. టూత్ పేస్ట్ తయారీలో నల్ల తుమ్మ చెట్టు బెరడును ఎక్కువగా వినియోగిస్తారు. ఈ టూత్ పేస్ట్ ఉపయోగించటం వల్ల దంతాల పసుపు రంగు తొలగిపోయి తెల్లగా ముత్యాల మెరిసిపోతాయి. నల్ల తుమ్మ చెట్టు బెరడుతో తయారుచేసిన టూత్ పేస్ట్ వాడకపోయినా కూడా ఈ చెట్టు కాయలను కాల్చి, దాని నుండి వచ్చే బూడిదతో పళ్లను తోమటం వల్ల పళ్ళు తెల్లగా మెరిసిపోతాయి.