ఈ కూరగాయలను మీరు ఫ్రిడ్జ్ లో పెడుతున్నారా.. ప్రాణాలకే ప్రమాదమట!

ఈ మధ్య కాలంలో మన దేశంలో ఫ్రిడ్జ్ ను వినియోగించే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఫ్రిడ్జ్ వాడటం వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో లాభాలు ఉన్నాయనే సంగతి తెలిసిందే. అయితే ఫ్రిడ్జ్ లో కొన్ని కూరగాయలను ఉంచడం వల్ల లాభం కంటే నష్టం కలిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. తరచూ ఫ్రిడ్జ్ ను వినియోగించే వాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.

 

ఫ్రిడ్జ్ లో కూరగాయలను ఉంచడం కంటే ఏరోజుకు ఆరోజు కూరగాయలను కొనుగోలు చేయడం మంచిది. ఈ విధంగా చేయడం వల్ల పోషకాలను నష్టపోయే అవకాశం అయితే ఉండదు. దెబ్బ తిన్న కూరగాయలను, ఒడిలిపోయిన కూరగాయలను ఫ్రిజ్ లో ఉంచకపోవడమే మంచిదని చెప్పవచ్చు. ఎక్కువ రోజులు నిల్వ ఉండే కూరగాయలను ఫ్రిడ్జ్ లో ఉంచకూడదు.

 

టమాటాలు అలాంటి కూరగాయలను ఫ్రిడ్జ్ లో ఉంచడం వల్ల లాభం కంటే నష్టం కలిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ఆకు కూరలు, బ్రోకిలీ, క్యాలీ ఫ్లవర్ లను ఫ్రిజ్ లో ఉంచవచ్చు. బంగాళదుంప, చిలగడదుంపలను ఫ్రిజ్ లో పెట్టుకోకూడదు. క్యారెట్, ముల్లంగి లాంటి వాటిని మాత్రం ఫ్రిజ్ లో ఉంచితే మంచిదని చెప్పవచ్చు. సొరకాయలు, దోసకాయలు ఫ్రిజ్ లో ఉంచినా బయట ఉంచినా వాటిలో పెద్దగా మార్పు అయితే ఉండదు.

 

కూరగాయలు తాజాగా ఉండాలని అనుకుంటే ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. తరచూ ఫ్రీజర్ ను వినియోగించే వాళ్లు ఒక కూరగాయను మరో కూరగాయతో కలపకుండా నిల్వ ఉంచుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి. కూరగాయల విషయంలో ఈ విషయాలకు సంబంధించి అవగాహన కలిగి ఉంటే మంచిదని చెప్పవచ్చు.