Mahesh Babu: ఆ హీరోయిన్ తో ఎఫైర్ నడిపిన మహేష్… రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న నమ్రత… డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు?

Mahesh Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటుడు మహేష్ బాబు. కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన హీరోగా ఎంతో గుర్తింపు పొందారు. బాల నటుడిగాను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్ బాబు అనంతరం హీరోగా కూడా మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి డైరెక్షన్లో ఓ పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఇక మహేష్ బాబు వ్యక్తిగత విషయానికి వస్తే 25వ సంవత్సరంలో బాలీవుడ్ నటి నమ్రతను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు సంతానం అనే విషయం మనకు తెలిసిందే. నమ్రత పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటూ మహేష్ బాబు సినిమా వ్యవహారాలతో పాటు కుటుంబ బాధ్యతలు అలాగే బిజినెస్లను కూడా చూసుకుంటూ ఉన్నారు.

ఇదిలా ఉండగా తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో భాగంగా డైరెక్టర్ గీత కృష్ణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన మహేష్ బాబు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహేష్ బాబు నమ్రతను వివాహం చేసుకున్న తర్వాత ఒక హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్నారని ఈయన తెలిపారు . మరి మహేష్ ఎఫైర్ పెట్టుకున్న హీరోయిన్ ఎవరో కాదు త్రిష అని కూడా ఈయన వెల్లడించారు. వీరిద్దరూ ముంబైలో రహస్యంగా కలుసుకున్నారని అయితే ఆ విషయం తెలిసిన నమ్రత వీరిద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడమే కాకుండా అక్కడే ఈ మ్యాటర్ పూర్తిగా సెటిల్ చేశారని గీతాకృష్ణ వెల్లడించారు.

ఇక మహేష్ బాబు త్రిష కాంబినేషన్లు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అతడు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా థియేటర్లలో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన బుల్లితెరపై మాత్రం సక్సెస్ అందుకుంది. ఈ సినిమా తర్వాత వీరిద్దరూ సైనికుడు అనే సినిమాలో కూడా నటించారు. ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. ఏది ఏమైనా త్రిష మహేష్ బాబు గురించి గీతాకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారడంతో మహేష్ అభిమానులు ఈయనపై ఫైర్ అవుతున్నారు.