ఎంత ప్రయత్నం చేసినా కూడా బరువు తగ్గడం లేదా ! అయితే వెంటనే ఈ టిప్స్ ఫాలో అవ్వండి

weight-loss-tips

బరువు తగ్గడం చాలామంది జీవితాల్లో కలగా ఉంటుంది. లావుగా ఉంది ఇబ్బందులు పడేవారు చాలామంది బరువు తగ్గడానికి చేయని ప్రయత్నం అంటూ ఉండదు. అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ లావు తగ్గడం లేదని భాద పడుతూ ఉంటారు. ఎన్ని రకాల డైట్స్ ఫాలో అయినా కూడా ఫలితం ఉండదు. వ్యయాలు చేసినా కూడా ఫలితం ఉండదు. అయితే అలా బాధపడే వారు కొన్ని చిట్కాలు పాటిస్తే తప్పకుండా చాలా తక్కువ రోజుల్లోనే బరువు తగ్గే అవకాశాలు ఉన్నాయి.

బరువు తగ్గడానికి టిప్స్:

* నీరు ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల పొట్ట నిండిన అనుభూతి కలిగి ఎక్కువ ఆహారం తినకుండా చేస్తుంది.
త‌ద్వారా బ‌రువు త‌గ్గొచ్చు.అంతే కాకుండా నీరు ఎక్కువగా తీసుకొంటే ఆరోగ్యం తో పాటు అందమైన శరీరం
కూడా సొంతమవుతుంది.

* షుగర్, కార్బో హైడ్రేట్స్ ఎక్కువగా ఉంటే ఆహారాని కి దూరం గా ఉండాలి.

* బ‌రువు తగ్గాలి అని అనుకుంటే గ్రీన్ టీ తప్పనిసరిగా తాగాలి. ఇందులో సమృద్దిగా ఉండే
యాంటీఆక్సిడెంట్లుశరీరంలో అధికకెలోరీలను తగ్గించడమే కాకుండా దృడమైన ఆరోగ్యాన్నీ కూడా ఇస్తాయి.

* ఇక ఉదయం వేళ బ్రేక్‌ఫాస్ట్‌లో ఎక్కువ ప్రోటీన్స్ ఉండే ఆహారం తీసుకోవాలి. దీని వ‌ల్ల రోజంతా తక్కువ
ఆహారం తీసుకుంటారు.

* ఇక పెరుగు, ఇడ్లీ, మ‌జ్జిగ‌, ప‌నీర్ వంటి ఆహార ప‌దార్థాల్లో ప్రొబ‌యోటిక్స్ ఎక్కువ‌గా ఉంటాయి.వీటిని
ఆహారం లో చేస్ర్చుకోవడం వలన ఇవి మ‌న ఆరోగ్యాన్ని కాపాడ‌డంతో పాటు బ‌రువు తగ్గడం లో బాగా
సహాయపడతాయి .

* భోజనానికి ముందు సూప్ తీసుకోవ‌డం వల్ల తినే కేలరీల సంఖ్య తగ్గుతుంది. మ‌రియు బ‌రువు త‌గ్గేందుకు
కూడా ఉపయోగ పడుతుంది.

* వారానికి 5 రోజులు ఖచ్చితంగా అరగంట పాటు నడకకి కానీ వ్యాయామం కి కానీ సమయం కేటాయించి
తీరవలిసిందే.అప్పుడే బరువు తగ్గడం తేలికవుతుంది.

* బరువు అదుపులో ఉండాలంటే రోజు కి 7 నుండి8 గంటల నిద్ర చాల అవసరం.

బరువు తగ్గాలని అనుకునే వారు ఈ కనీస జాగ్రత్తలు తీసుకుంటే చాలా తక్కువ సమయంలోనే తగ్గుతారు. మనం వీటిని ఎదో పనిలా చేస్తే ఫలితం ఉండదు. ఈ జాగ్రత్తలను ఎంజాయ్ చేస్తే ఫలితాలు ఇంకా తొందరగా చూస్తారు.