మనలో చాలామంది నిత్య జీవితంలో కంఫర్ట్ కే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. షూస్ ధరించిన సమయంలో సాక్స్ లు ధరించడానికి ఎక్కువమంది ఇష్టపడరు. అయితే సాక్స్ లు ధరించకుండా షూ వేయడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే ఛాన్స్ అయితే ఉంటుంది. సాక్స్ లు ధరించకపోతే చర్మ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పాదాల చెమట, దుర్వాసన వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
సాక్స్ లు బ్యాక్టీరియా నుంచి రక్షించడంతో పాటు పాదాలను హెల్తీగా ఉంచడంలో తోడ్పడతాయి. చలికాలం, వేసవికాలాలలో సాక్స్ లను ధరించడం వల్ల చలి, ఎండ నుంచి ఉపశమనం లభిస్తుంది. తరచూ సాక్సులు ధరించని వ్యక్తుల కాళ్లపై బొబ్బలు ఏర్పడే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఇప్పటికే ఈ అలవాటు ఉన్నవాళ్లు ఈ అలవాటును మార్చుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు.
సాక్స్ లను ధరించడానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే , సమస్యలు ఏర్పడితే క్వాలిటీ సాక్స్ లను ధరించడానికి ప్రాధాన్యత ఇస్తే మేలు జరుగుతుంది. పాదరక్షలను కొనుగోలు చేసేటప్పుడు, నాణ్యత, ధర తక్కువగా ఉందనీ.. షూలు కళ్లకు ఆకర్షణీయంగా కనిపిస్తే ఆలోచించకుండా కొనుగోలు చేయడానికి ఎక్కువమంది ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు.
ఖరీదైన షూలు కొనే సమయంలో కంఫర్ట్ కు ప్రాధాన్యత ఇచ్చి షూలు కొనుగోలు చేయడం ద్వారా ఎలాంటి సమస్యలు తలెత్తవు. బూట్లు ధరించే వారు సాక్సులను వేసుకోవాలని నిపుణులు సైతం వెల్లడిస్తున్నారు. సాక్సులు ధరించే వాళ్లు ఈ విషయాలను కచ్చితంగా గుర్తుంచుకోవాలి.