విటమిన్ బీ12 ట్యాబ్లెట్లను తీసుకునే వాళ్లకు షాకింగ్ న్యూస్.. వీటి వల్ల ఏకంగా ఇంత ప్రమాదమా?

మనం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి చాలా రకాల విటమిన్లు, పోషకాలు అవసరం అవుతాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విటమిన్ బీ12 తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో బెనిఫిట్స్ లభిస్తాయి. ఎర్ర రక్త కణాల ఉత్పత్తి, నరాల ఆరోగ్యంతో పాటు ఇతర బెనిఫిట్స్ ను అందించడంలో ఈ ట్యాబ్లెట్లు సహాయపడతాయి. విటమిన్-బి12 లోపాన్ని భర్తీ చేయడానికి చాలామంది సప్లిమెంట్లను ఉపయోగిస్తారు.

విటమిన్ బీ12 నీటిలో కరిగే విటమిన్ కాగా నీటిలో కరిగే విటమిన్లు శరీరం ద్వారా త్వరగా ప్రాసెస్ చేయబడతాయని చెప్పవచ్చు. ఇవి ఎక్కువ కాలం పాటు శరీరంలో నిల్వ ఉండవు. విటమిన్ బ్12 ఆక్సిజన్‌ను రవాణా చేసే ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడంలో ఎంతగానో ఉపయోగపడుతుందని కచ్చితంగా చెప్పవచ్చు. పగటిపూట దీన్ని తీసుకోవడం వల్ల సాధారణం కంటే మరింత శక్తివంతంగా మారే అవకాశం ఉంటుంది.

అయితే విటమిన్ బీ12 వల్ల నిద్రకు అంతరాయం కలిగే అవకాశాలు ఉంటాయి. విటమిన్-బి12 శరీరంలో మెలటోనిన్‌ను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుందని చెప్పవచ్చు. శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవడానికి, సిర్కాడియన్ రిథమ్‌ను ఆరోగ్యంగా ఉండటానికి ఇది తోడ్పడుతుంది. భోజనానికి అరగంట ముందు లేదా తిన్న 2 గంటల తర్వాత నీటితో తీసుకున్నప్పుడు విటమిన్ కరిగిపోయే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

ఖాళీ కడుపుతో విటమిన్ బీ12 తీసుకుంటే కొంతమందికి వికారం లేదా కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. తేలికపాటి కొవ్వులు ఉన్న ఆహారాన్ని తీసుకున్న తరువాత విటమిన్-బి12 తీసుకుంటే హెల్త్ బెనిఫిట్స్ లభిస్తాయని చెప్పవచ్చు. విటమిన్ బీ12 సప్లిమెంట్లను తీసుకునే వాళ్లు ఈ విషయాలను కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి.