ఒకే టవల్ ను ఎక్కువ రోజులు వాడుతున్నారా.. ఈ ప్రమాదకర సమస్యలు వచ్చే ఛాన్స్!

టవల్‌ను ఎక్కువ రోజులు వాడితే అది బ్యాక్టీరియా మరియు అంటువ్యాధులకు నిలయంగా మారుతుంది. ఇది ముఖంపై మచ్చలు, మొటిమలు, మరియు చర్మం ఇన్ఫెక్షన్‌లకు దారి తీస్తుంది. తడిసిన టవల్ పై బ్యాక్టీరియా మరియు ఇతర సూక్ష్మజీవులు పెరుగుతాయి. ఇలాంటి బ్యాక్టీరియా సోకితే చర్మంపై మచ్చలు, మొటిమలు, లేదా ఇతర చర్మం ఇన్ఫెక్షన్లు రావచ్చు. టవల్ ద్వారా ఇతర వ్యక్తులకు కూడా అంటువ్యాధులు సోకే అవకాశం ఉంటుంది.

కొన్ని రకాల టవల్స్ వల్ల అలెర్జీలు కూడా రావచ్చు. స్నానం చేసిన వెంటనే లేదా టవల్ తడిగా ఉన్నప్పుడు వెంటనే ఉతకడం మంచిది. టవల్ను ఎండలో లేదా గాలిలో బాగా ఆరబెట్టాలి. టవల్ను తరచుగా మార్చడం వల్ల బ్యాక్టీరియా పెరుగుదలను నివారించవచ్చు. ఒకరి టవల్ ను మరొకరు వాడటం వల్ల కొత్త ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు అయితే ఉంటాయని కచ్చితంగా చెప్పవచ్చు.

రోజూ ఉపయోగించే టవల్ ను సరిగా శుభ్రం చేయకపోతే అందులో 14 శాతం ఇ కోలి బ్యాక్టీరియా వ్యాప్తి చెందే ఛాన్స్ అయితే ఉంటుంది. టవల్‌ను ఎక్కువ రోజులు వాడితే అనేక నష్టాలు వస్తాయి. టవల్‌పై బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్‌లు చేరి చర్మం మరియు ఆరోగ్య సమస్యలకు దారి తీస్తాయి. అందువలన, ప్రతిరోజూ టవల్‌ను ఉతకడం మంచిది. టవల్‌ను ఎక్కువ రోజులు వాడితే, తడి జుట్టును టవల్‌తో చుట్టుకుంటే జుట్టు రాలిపోవడం, చిక్కులు పడటం వంటి సమస్యలు వస్తాయి.

టవల్‌ను సూర్యరశ్మిలో ఆరబెట్టడంతో పాటు ఫేస్ టవల్, బాత్ టవల్ వేరువేరుగా వాడటం మంచిది. టవల్‌ను అధిక ఉష్ణోగ్రత వద్ద ఉతకడం మంచిది. ఎక్కువ డిటర్జెంట్ ఉపయోగించడం వల్ల టవళ్లు దెబ్బ తింటాయి. అంతే కాకుండా వాటిని తక్కువ మృదువుగా, మెత్తటివిగా ఉంచుతాయి. నాణ్యమైన డిటర్జెంట్‌ని వాడాలి. ఇలా చేయడం వల్ల టవల్‌ ఎక్కువ సేపు మృదువుగా ఉంచేందుకు సహాయపడుతుంది