Gas saving Tips: గ్యాస్ సిలిండర్ తొందరగా అయిపోతుందా.. ఈ టిప్స్ పాటిస్తే చాలు?

Gas saving Tips: ఒకప్పుడు వంట చేయాలి అంటే కట్టెల పొయ్యి మీదనే వంట చేసేవారు ఇలా కట్టెల పొయ్యి మీద వంట చేయటం వల్ల వంట మరింత రుచిగా ఉండేది కానీ రాను రాను కట్టెల పొయ్యలు పూర్తిగా కనుమరుగవుతున్నాయి. ఇలా కట్టెల పొయ్యిల స్థానంలో గ్యాస్ స్టవ్ లు మనకు అందుబాటులోకి వచ్చాయి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఇప్పుడు గ్యాస్ స్టవ్ తప్పనిసరిగా ఉంటుంది. ఇకపోతే చాలామంది గ్యాస్ సిలిండర్లు ఉపయోగించడం వల్ల నెలకు ఒకసారి గ్యాస్ సిలిండర్ పూర్తి అవ్వడంతో నెలకొక సిలిండర్ కొనడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు.

ఇలా గ్యాస్ సిలిండర్ బిగించినప్పటి నుంచి మనం ఎక్కువ రోజులు రావడం కోసం కొన్ని చిట్కాలను కనుక పాటిస్తే గ్యాస్ సిలిండర్ ఎక్కువ రోజులు ఉపయోగించవచ్చు. మరి ఎలాంటి చిట్కాలను పాటించి గ్యాస్ సేవ్ చేయాలి అనే విషయానికి వస్తే… ముందుగా గ్యాస్ సిలిండర్ మనం ఎప్పుడు బిగించాము అనే తేదీని గుర్తు పెట్టుకోవాలి. అలాగే గ్యాస్ ఎక్కడైనా లీక్ అవుతుందా అన్న విషయాలను గమనించి మరమ్మతులు చేసుకోవాలి.

ఇక బర్నర్ లను కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేయటం వల్ల గ్యాస్ తొందరగా పూర్తి కాకుండా ఎక్కువ రోజులు వస్తుంది. అదేవిధంగా మనం ఏదైనా వంట చేసేటప్పుడు తప్పనిసరిగా ఆ పాత్రలపై మూత పెట్టడం వల్ల వంట తొందరగా పూర్తి అవుతుంది తద్వారా గ్యాస్ కూడా ఆదా అవుతుంది. ఇక చాలామంది కూరలు చేసేటప్పుడు మాటిమాటికి కూరలోకి నీళ్లు పోస్తూ ఉంటారు అలాంటప్పుడు కూర పూర్తి అవ్వడానికి చాలా సమయం పడుతుంది గ్యాస్ కూడా వేస్ట్ అవుతుంది అందుకే కూరకు సరిపడా నీటిని ఒకేసారి వేసి మూత పెట్టి చేసుకోవటం వల్ల వంట తొందరగా పూర్తి అవుతుంది. ఇకపోతే చాలామంది గ్యాస్ ఎక్కువ మంట పెట్టడం వల్ల వంట తొందరగా పూర్తి అవుతుందని భావిస్తారు కానీ సిమ్లో పెట్టుకుని చేయటం వల్ల వంట తొందరగా పూర్తి అవ్వడమే కాకుండా గ్యాస్ కూడా ఆధా చేయవచ్చు.