Kitchen Tips: మనం వంటింట్లో ఎన్నో రకాల ఆహార పదార్థాలను తయారు చేసుకొని తింటూ ఉంటాము. ఈ క్రమంలోనే వారంలో రెండు మూడు సార్లు అయినా దోశ చపాతి చేయడం కోసం మనం పెనం ఉపయోగిస్తూ ఉంటాము. ప్రస్తుత కాలంలో చాలామంది నాన్ స్టిక్ పెనం ఉపయోగిస్తున్నారు. కానీ ఆరోగ్యంపై ఇటీవల కాలంలో చాలా మంది దృష్టి సారించి ఐరన్ పెనం కూడా ఉపయోగిస్తూ ఉన్నారు. ఇలా ఇనుము పెనంపై వంటలు తయారు చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది కూడా.
ఇలా మనం వారంలో మూడు రోజుల పాటు పెనం ఉపయోగించి వంటలు తయారు చేసుకొని తింటూ ఉన్న క్రమంలో పెనం మొత్తం జిడ్డుగా మారిపోయి చివరిన నల్లగా కూడా తయారవుతుంది ఇలాంటి వాటిలో ఆహార పదార్థాలు తయారు చేసుకుంటే అది ప్రమాదకరంగా మారుతుంది. ఇలా పేరుకుపోయిన జిడ్డు మరకలను ఎంత తొలగించిన కొన్నిసార్లు తొలగిపోవు అలాంటప్పుడు ఈ సింపుల్ చిట్కాలను ఉపయోగించి పెనంపై ఉన్నటువంటి జిడ్డు మరకలను చాలా ఈజీగా తొలగించవచ్చు.
మరి పెనంపై ఉన్నటువంటి ఈ మరకలను తొలగించడానికి ఎలాంటి చిట్కాలను ఉపయోగించాలి అనే విషయానికి వస్తే ముందుగా ఒక నిమ్మకాయ తీసుకొని మధ్యలో కట్ చేసి దానిని ఉప్పులో ముంచి పెనం మొత్తం రుద్దాలి ఇలా ఐదు నిమిషాల పాటు ఉంచిన తర్వాత వేడి నీటితో శుభ్రం చేసి స్క్రబ్ తీసుకొని బాగా రుద్దితే జిడ్డు మరకలు మొత్తం తొలగిపోతాయి. వెనిగర్ కూడా పెనం మీద జిడ్డును తొలగించడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఒక గిన్నెలో నీరు, వెనిగర్ సమాన భాగాలుగా తీసుకుని బాగా కలిపి స్పాంజ్ సాయంతో పెనం మీద రుద్దితే పెనంపై ఉన్న జిడ్డు మొత్తం తొలగిపోతుంది. ఇలా ఈ సింపుల్ చిట్కాలతో ఈజీగా జిడ్డును తొలగించి శుభ్రం చేసుకోవచ్చు.