యూపీఎస్సీలో 493 ఉద్యోగ ఖాళీలకు జాబ్ నోటిఫికేషన్.. ఒకింత భారీ వేతనంతో?

యూపీఎస్సీ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 493 ఉద్యోగ ఖాళీలకు జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం సంస్థ దరఖాస్తులు కోరుతుండగా నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. అర్హత ఉన్న అభ్యర్థులు జూన్ నెల 12వ తేదీ వరకు సులువుగా దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని సమాచారం అందుతోంది.

కేవలం 25 రూపాయలు దరఖాస్తు ఫీజు చెల్లించడం ద్వారా అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. లీగల్ ఆఫీసర్ గ్రేడ్1, ఆపరేషన్స్ ఆఫీసర్, సైంటిఫిక్ ఆఫీసర్, సైంటింస్ట్ బీ మెకానికల్, అసోసియేట్ ప్రొఫెసర్ సివిల్, అసోసియేట్ ప్రొఫెసర్ మెకానికల్ ఉద్యోగాలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది.

ఈ ఉద్యోగ ఖాళీలతో పాటు సివిల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీసర్, జూనియర్ రీసెర్చ్ ఆఫీసర్, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ప్రిన్సిపాల్ సివిల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీసర్, ప్రిన్సిపల్ డిజైన్ ఆఫీసర్ ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తారు. రీసెర్చ్ ఆఫీసర్, ట్రాన్స్ లేటర్, అసిస్టెంట్ లీగల్ అడ్వైసర్ ఉద్యోగాలను సైతం భర్తీ చేయనున్నారు.

సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, బీటెక్, ఎల్.ఎల్.బీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 30 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యొగ ఖాళీలకు అర్హులు. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తారని తెలుస్తోంది. ఇంటర్వ్యూద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.