సోషల్ మీడియాలో ఎప్పుడూ కొత్త కొత్త వెల్నెస్ ట్రెండ్స్ వచ్చి పోతూనే ఉంటాయి. కానీ వాటిలో కొన్ని మాత్రమే నిజంగా ఫాలో అవడానికి పనికివస్తాయి. ప్రస్తుతం ఫిట్‌నెస్ ప్రియుల్లో వైరల్ అవుతున్నది 3×3 ఫిట్‌నెస్ రూల్. కఠినమైన జిమ్ షెడ్యూల్స్, కాంప్లికేటెడ్ డైట్ ప్లాన్స్ కాకుండా, మూడు సింపుల్ టాస్కులే ఇందులో ఉంటాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఈ టాస్కులను పూర్తి చేస్తే శరీరానికి ఎనర్జీ పెరుగుతుందని, మూడ్ స్టేబుల్‌గా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఈ రూల్‌లో ఏముంటుంది: మూడు ముఖ్యమైన పనులు 3,000 అడుగులు నడవడం, రోజువారీ నీటి అవసరంలో మూడింట ఒక వంతు తాగడం, 30 గ్రాముల ప్రోటీన్ తీసుకోవడం. ఈ మూడు టాస్కులు కలిసి శరీరానికి హైడ్రేషన్, పోషకాహారం, మూవ్‌మెంట్ అనే బేసిక్ అవసరాలను పూర్తి చేస్తాయి. నిపుణుల ప్రకారం ఉదయం సమయంలో ఈ మూడు పనులు చేస్తే మరింత ఫలితం ఉంటుంది. రక్తప్రసరణ మెరుగుపడి, మెటబాలిజం వేగంగా పనిచేస్తుంది. బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. డైజెషన్ సులభం అవుతుంది. ముఖ్యంగా వర్క్ ప్రెజర్ లేదా డిస్ట్రాక్షన్స్ వల్ల తరువాత స్కిప్ అయ్యే అవకాశమే ఉండదు.
ఉదయాన్నే నడక: మొదటిది ఉదయం నడక శరీరాన్ని మేల్కొలిపి స్టిఫ్‌నెస్ తగ్గిస్తుంది. కేలరీలు బర్న్ అవుతాయి. “ఫీల్ గుడ్ ” హార్మోన్స్ విడుదలై మూడ్ హ్యాపీగా మారుతుంది. మెట్లు ఎక్కడం, షాప్‌కి వెళ్లేటప్పుడు నడవడం వంటి చిన్న పనులు కూడా ఈ లెక్కలోకి వస్తాయి.
హైడ్రేషన్ పవర్: ఇక రెండోది…మూడింట ఒక వంతు నీటిని ఉదయాన్నే తాగితే డే మొత్తం ఎనర్జీ కంట్రోల్‌లో ఉంటుంది. దాహాన్ని ఆకలిగా పొరబడి స్నాక్స్ తినకుండా అడ్డుకుంటుంది. బ్రెయిన్ ఫంక్షన్ మెరుగుపడుతుంది. రాత్రి ఆలస్యంగా నీరు తాగాల్సిన అవసరం తగ్గి నిద్ర కూడా ప్రశాంతంగా ఉంటుంది.
ప్రోటీన్ ఇంపాక్ట్: ఉదయం 30 గ్రాముల ప్రోటీన్ తీసుకుంటే ఎక్కువసేపు కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. అన్‌హెల్తీ స్నాక్స్‌కి దూరంగా ఉంటారు. మజిల్స్ రికవరీకి సపోర్ట్ ఇస్తుంది. గుడ్లు, పెరుగు, నట్స్, బీన్స్ లేదా ప్రోటీన్ షేక్ తీసుకోవచ్చు.
ఎందుకు వైరల్ అవుతోంది: ఈ 3×3 రూల్ గుర్తుంచుకోవడం సులభం. ప్రాక్టికల్‌గా కూడా అమలు చేయవచ్చు. పెద్ద టైమ్ లేదా డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. అదే కారణంగా సోషల్ మీడియాలో వేగంగా ప్రాచుర్యం పొందుతోంది.
జాగ్రత్తలు తప్పనిసరి: అయితే నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇది పూ ర్తి ఫిట్‌నెస్ ప్లాన్ కాదు. స్ట్రెంత్ ట్రైనింగ్, స్ట్రెచింగ్, బ్యాలెన్స్‌డ్ డైట్ తప్పనిసరిగా చేయాలి. ఎక్కువ నీరు తాగడం, ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడం అందరికీ సరిపడకపోవచ్చు. గాయాలు లేదా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు 3,000 అడుగులు నడవడం కష్టం కావచ్చు. కాబట్టి వ్యక్తిగత అవసరాలకు తగ్గట్టే మార్చుకోవాలి. 3×3 రూల్ ప్రాచుర్యం పొందిన కారణం ఒక్కటే ఫిట్‌నెస్‌ని కష్టతరం కాకుండా సింపుల్‌గా చేయడమే. రోజువారీ చిన్న ప్రయత్నాలు పెద్ద మార్పులు తీసుకురాగలవని ఈ రూల్ మనకు గుర్తు చేస్తోంది. (గమనిక: ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న కథనం ఆధారంగా రాసినది దీనిని తెలుగు రాజ్యం ధృవీకరించడం లేదు.)
