గూగుల్ పే, ఫోన్ పే వాడేవాళ్లకు అలర్ట్.. ఈరోజు నుంచి యూపీఐ రూల్స్ లో కీలక మార్పులివే!

ప్రస్తుత కాలంలో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ యూపీఐ లావాదేవీలపై ఆధారపడుతున్నారు. స్కూల్ ఫీజులు చెల్లించాలన్నా, ఆస్పత్రులకు సంబంధించిన లావాదేవీలు జరపాలన్నా, హోటల్ లో భోజనం చేయాలన్నా యూపీఐ ద్వారా చెల్లింపులు సాధారణం అయిపోయాయి. అయితే యూపీఐ లావాదేవీలకు సంబంధించి నేటి నుంచి కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి.

యూపీఐ ద్వారా ఆటోమేటిక్ చెల్లింపుల పరిమితిని లక్ష రూపాయలకు పెంచుతున్నట్టు ఆర్బీఐ గతంలో కీలక ప్రకటన చేసింది. బీమా ప్రీమియం చెల్లింపులతో పాటు క్రెడిట్ కార్డ్ బిల్లుల చెల్లింపులకు సైతం ఈ నిబంధనలు వర్తించనున్నాయి. గతంలో విద్యా సంస్థలు, ఆస్పత్రులకు ఒకసారి లక్ష రూపాయల వరకు చెల్లించే ఛాన్స్ ఉండగా ఇప్పుడు ఆ పరిమితి 5 లక్షల రూపాయలుగా ఉంది.

యూపీఐ ఐడీలు, నంబర్లు సంవత్సరం పాటు వినియోగంలో లేకపోతే ఆ నంబర్లు డీ యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇకపై 2000 రూపాయల కంటే ఎక్కువగా చేసే మర్చంట్ లావాదేవీలపై 1.1 శాతం ఇంటర్ ఛేంజ్ ఛార్జీలు వర్తించనున్నాయి. ఒక బ్యాంక్ ఖాతా నుంచి మరో బ్యాంక్ ఖాతాకు లావాదేవీలు చేయడానికి మాత్రం ఎలాంటి ఛార్జీలు ఉండవు. త్వరలో దేశవ్యాప్తంగా యూపీఐ ఏటీఎంల ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి.

త్వరలో యూపీఐ ట్యాక్స్ అండ్ పే విధానాన్ని అమలు చేయనుంది. యూపీఐ ఫోన్లో నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ అనే ఫీచర్ ను అమలు చేయనుంది. యూపీఐ ద్వారా కొత్త వ్యక్తులకు చెల్లించే మొత్తం 2000 రూపాయలు దాటితే లావాదేవీ పూర్తి కావడానికి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంటుంది.