రైతులకు అదిరిపోయే శుభవార్త.. ఈ పని చేస్తే పీఎం కిసాన్ నగదు జమయ్యే ఛాన్స్!

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అద్భుతమైన స్కీమ్స్ లో పీఎం కిసాన్ స్కీమ్ కూడా ఒకటనే సంగతి తెలిసిందే. వ్యవసాయం చేసే రైతులు ఆర్థికంగా కుంగిపోకుండా పెట్టుబడి సాయం అందించాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది. త్వరలో రైతుల ఖాతాలలో 19వ విడత నిధులు జమ కానున్నాయి. అర్హత ఉన్న వ్యక్తులకు 2000 రూపాయల చొప్పున కేంద్రం జమ చేయనుంది.

భాగల్పూర్‌కు చెందిన రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులను జమ చేయనున్నారని సమాచారం అందుతోంది. 9 కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో ఈ నగదును జమ చేయనున్నారని తెలుస్తోంది. రైతులు ఈ నగదు పొందాలంటే ఈ కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. http://pmkisan.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది.

వెబ్ సైట్ ద్వారా ఈ కేవైసీ పూర్తి చేసే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత ఈ కేవైసీ పూర్తవుతుంది. రాష్ట్రం, జిల్లా, గ్రామం వివరాలను ఎంటర్ చేయడం ద్వారా పీఎం కిసాన్ ఖాతాలో నగదు జమయ్యే అవకాశాలు ఉంటాయి. పీఎం కిసాన్ యోజన లిస్ట్ లో పేర్లు ఉన్నవాళ్లు ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందవచ్చు.

పీఎం కిసాన్ స్కీమ్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే సమీపంలోని వ్యవసాయ అధికారులను సంప్రదించవచ్చు. పీఎం కిసాన్ స్కీమ్ నగదు మొత్తాన్ని రాబోయే రోజుల్లో పెంచే అవకాశం ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.