మనలో చాలామంది ఆధార్ కార్డ్ ను కలిగి ఉంటారు. ఆధార్ కార్డ్ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో బెనిఫిట్స్ ను పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఏ స్కీమ్ కు సంబంధించి అర్హత పొందాలన్నా ఆధార్ కార్డ్ ను కచ్చితంగా కలిగి ఉండాలి. ప్రభుత్వ పథకాలు పొందడంతో పాటు ఎన్నో లావాదేవీలకు ఆధార్ కార్డ్ అవసరం అనే సంగతి తెలిసిందే. ఆధార్ కార్డ్ ను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకోవాలి.
అప్ డేట్ చేసుకోని ఆధార్ కార్డ్ ను కొన్నిసార్లు తిరస్కరించే అవకాశం ఉంటుంది. ఆధార్ కార్డ్ స్టేటస్ ను కచ్చితంగా తెలుసుకోవాలి. ఈ ఏడాది మార్చి నెల 14వ తేదీ వరకు ఫ్రీగా ఆధార్ కార్డ్ ను అప్ డేట్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. https://uidai.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఆధార్ కార్డ్ ను అప్ డేట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆ తర్వాత అప్ డేట్ చేసుకోవాలంటే మాత్రం డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని చెప్పవచ్చు.
ఆధార్ కార్డ్ అప్ డేట్ ద్వారా ఫోటో, అడ్రస్ మార్చుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆధార్ కార్డ్ వేలి ముద్రలను కూడా సులువుగా అప్ డేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. వేర్వేరు కారణాల వల్ల వేలిముద్రలు పడక ఇబ్బందులు పడుతున్న వారు వేలిముద్రలను అప్ డేట్ చేయించుకోవడం ద్వారా ఈ ఇబ్బందులను అధిగమించవచ్చు. అవసరమైన పత్రాలను అప్ లోడ్ చేయడం ద్వారా ఆధార్ కార్డ్ ను అప్ డేట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది.
ఆధార్ కార్డ్ ను అప్ డేట్ చేసుకున్న తర్వాత ఆధార్ కార్డ్ ను సులువుగా డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆధార్ కార్డ్ పీవీసీ కార్డ్ ఇంటికి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ఆ కాపీని డిజిటల్ రూపంలో ఉంచుకునే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు.