OG కూడా పూర్తయింది.. పవన్ కొత్త పోస్టర్ వైరల్.. రిలీజ్ ఎప్పుడంటే..?

పవర్ స్టార్ అభిమానుల ఉత్సాహానికి ఇక హద్దే లేదు. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న OG సినిమా తాజా అప్‌డేట్ ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని నింపుతోంది. రాజకీయాల కారణంగా పలు సందర్భాల్లో వాయిదా పడుతూ వచ్చిన OG షూటింగ్ ఎట్టకేలకు పూర్తి అయిందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. సినిమా సెట్స్ పైకి పవన్ వెళ్లినప్పుడల్లా అభిమానుల హడావుడి వేరే లెవెల్లోనే ఉండేది. ఇప్పుడు షూటింగ్ మొత్తం పూర్తయిందని యూనిట్ చెబుతుండగా, రిలీజ్ డేట్ కూడా మళ్లీ రీ-కంఫర్మ్ చేశారు. దసరా కానుకగా సెప్టెంబర్ 25న OG థియేటర్లలో దర్శనం ఇవ్వనుంది.

తాజాగా రిలీజ్ చేసిన కొత్త పోస్టర్‌లో పవన్ కళ్యాణ్ గన్ తో సూపర్ ఇంటెన్స్ లుక్‌లో దర్శనమిస్తూ అభిమానులకు పండగ మూడ్ క్రియేట్ చేశాడు. ఈ పోస్టర్ బయటకు వచ్చిన కొన్ని నిమిషాల్లోనే సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో కామెంట్స్ చేస్తున్నారు.

DVV ఎంటర్‌టైన్మెంట్స్ పై దానయ్య భారీగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు సుజీత్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. పవన్‌కి తోడుగా అర్జున్ దాస్, ప్రియాంక మోహన్, ఇమ్రాన్ హష్మీ, శ్రియ రెడ్డి లాంటి నటీనటులు స్క్రీన్ మీద అదరగొట్టనున్నారు. రిలీజ్ డేట్ క్లోజ్ అయ్యింది.. ఇప్పుడు ప్రమోషన్స్ కి రెడీ అవుదాం.. మరిన్ని అప్డేట్స్ రాబోతున్నాయి.. అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. ఇక OG అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఈ హడావుడి చూస్తే అర్థమవుతుంది.