బంగారం కొనుగోలు చేస్తున్నారా.. ఈ తప్పులు చేస్తే మాత్రం గోల్డ్ పోగొట్టుకున్నట్టే!

ప్రస్తుత కాలంలో బంగారంపై ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో మంచి లాభాలను అందించే అవకాశం ఉంటుంది. బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకోవడం మన దేశంలో సాధారణం అనే సంగతి తెలిసిందే. ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు సైతం బంగారంను తాకట్టు పెట్టుకుని రుణం ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

బ్యాంకులు సైతం బంగారానికి సంబంధించిన రుణాలను వేగంగా మంజూరు చేస్తున్నాయి. అయితే బంగారం రుణాలను పొందాలని భావించే వాళ్లు కొన్ని విషయాలను మాత్రం తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. బంగారం రుణాలను పొందిన వాళ్లు ఏ అవసరం కోసమైనా ఆ డబ్బులను ఖర్చు చేయాల్సి ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో బంగారం రుణాలు బెస్ట్ ఆప్షన అవుతాయని చెప్పవచ్చు.

ప్రభుత్వ రంగ బ్యాంకులు 8.8 శాతం వడ్డీతో ఈ రుణాలను అందిస్తున్నాయి. బంగారం పరిమాణం ఆధారంగా గరిష్టంగా కోటిన్నర రూపాయల వరకు రుణం పొందే ఛాన్స్ ఉంటుంది. ఒక్కో బ్యాంకులో ఈ వడ్డీ ఒక్కో విధంగా ఉంటుంది. ఉదాహరణకు లక్ష రూపాయల రుణం పొందితే 12 నెలల తర్వాత వడ్డీ 10000 రూపాయలుగా ఉంటుంది. బంగారం స్వచ్చత ఆధారంగా రుణం లభిస్తుందని చెప్పవచ్చు.

బ్యాంకులు బంగారం విలువలో 70 శాతం వరకు రుణంగా మంజూరు చేయడం జరుగుతుంది. బంగారం రుణం పొందేవాళ్లు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లను గుర్తింపు కార్డుగా ఇవ్వాల్సి ఉంటుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులలో బంగారం రుణం తీసుకోవడం ఉత్తమమని చెప్పవచ్చు. ఆర్బీఐ గైడ్ లైన్స్ పాటించే సంస్థలలో రుణం తీసుకుంటే మంచిది.