ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. చాటింగ్ షేరింగ్ వంటి వాటికోసం ఈ సోషల్ మీడియా యాప్ ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇక ఎలన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు చేసిన తర్వాత ట్విట్టర్ లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో ట్విట్టర్ కు వెరిఫైడ్ బ్యాడ్జ్ ఉచితంగా ఇచ్చేవారు. కానీ ఇప్పుడు వాటికోసం ప్రతి నెల కొంత డబ్బు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా ఇప్పుడు 3 రకాల బ్యాడ్జులను కూడా తీసుకొచ్చారు. ఇక ఇప్పుడు ఈ బ్లూ టిక్ సబ్ స్క్రిప్షన్ పాలసీ ఇండియాలో అధికారింగా లాంఛ్ అయ్యింది. ఈ బ్లూ టిక్ మార్క్ ఉంటే ఆ ఖాతా కి అప్రూవల్ ఉన్నట్లు.
ఇక ప్రస్తుతం భారతదేశంలో ఈ బ్లూటిక్ సబ్ స్క్రిప్షన్ పాలసీని ఇటీవల లాంఛ్ చేశారు. అయితే మీరు ఈ బ్లూటిక్ ఎలా తీసుకోవాలి? తీసుకోవడం వల్ల మీకు కలిగే అదనపు ప్రయోజనాలు ఏంటి? అనే విషయాలను గురించి కూడా వెల్లడించారు. ట్విట్టర్ లో బ్లూటిక్ పొందాలంటే అకౌంట్ క్రియేట్ చేసి 90 రోజులు గడవాల్సి ఉంటుంది. అలాగే ట్విట్టర్ లో మొబైల్ నెంబర్ వెరిఫై చేసిన తర్వాతనే ఈ బ్లూ టిక్ సబ్స్క్రిప్షన్ పొందే అవకాశం ఉంటుంది. మొబైల్ నెంబర్ వెరిఫై చేసిన మీ మొబైల్ యాప్ లో ప్రొఫైల్ పిక్ పై క్లిక్ చేస్తే.. ట్విట్టర్ బ్లూ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసిన తర్వాత రూ.900 పే చేయాలి. అమౌంట్ పే చేసిన తర్వాత మీ రిక్వెస్ట్ రిసీవ్ అవుతుంది. ఆ సమయంలో మీరు మీ నేమ్, ప్రొఫైల్ పిక్చర్, యూజర్ నేమ్ లాంటివి ఛేంజ్ చేయడం కుదరదు. అలా చేస్తే మీ వాలిడేషన్ రిక్వెస్ట్ క్యాన్సిల్ అవుతుంది. ఒకసారి రివ్యూ చేసిన తర్వాత మీ అకౌంట్ కు బ్లూ టిక్ లభిస్తుంది.
బ్లూ టిక్ వల్ల ఏంటి లాభం :
బ్లూటిక్ సబ్ స్క్రిప్షన్ తీసుకోవడం వల్ల సబ్ స్క్రైబర్స్ ట్విట్టర్ నుంచి యడ్స్ ద్వారా అదనంగా ఆదాయం పొందవచ్చు. అలాగే సబ్ స్క్రైబర్స్ కు లాంగ్ ట్వీట్లు పెట్టేందుకు కూడా అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ట్వీట్ చేసిన 30 నిమిషాలలో ఆ ట్వీట్ ని ఎడిట్ చేసే సదుపాయం కూడా ఉంటుంది. ఇలా అరగంటలో 5 సార్లు ఎడిట్ చేసేందుకు వీలుంటుంది. ట్విట్టర్నుంచి భవిష్యత్ లో వచ్చే అప్ డేట్స్, ఫీచర్లకు కూడా వీరికి ఎర్లీ యాక్సెస్ ఉంటుంది. స్కామ్స్, స్పామ్స్ ఫైట్ చేసే విషయంలో బ్లూ బాడ్జ్ ఉన్నవారికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.