అతిగా వ్యాయామాలు చేసేవాళ్లకు షాకింగ్ న్యూస్.. వీటి వల్ల ఇంత ప్రమాదమా?

ఈ మధ్య కాలంలో చాలామంది బరువు తగ్గడానికి, ఇతర ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం వ్యాయామంపై ఆధారపడుతున్నారు. వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. అయితే అతిగా వ్యాయామం చేయడం మాత్రం ఆరోగ్యానికి మంచిది కాదు. ఒక వ్యక్తి కేవలం 15 రోజుల్లో 10 కేజీల బరువు తగ్గాడు. శరీర బరువులో 13 శాతాన్ని కేవలం రెండు వారాల్లో తగ్గించుకున్నాడు.

అయితే ఈ విధంగా చేయడం వల్ల అతని కుడి కాలులో సమస్య మొదలైంది. అకస్మాత్తుగా బరువు తగ్గిన సందర్భాల్లో అరికాళ్లల్లో ఉండే కొవ్వు పొర కరగడంతో పాటు , కాలి కదలికలు, స్పర్శకు కారణమయ్యే నాడీ కణాలపై ఒత్తిడి పెరుగుతుంది. చివరకు కాల్లో స్పర్శ తగ్గి, కదపలేని స్థితి వచ్చే అవకాశాలు ఉంటాయి. బరువు తగ్గేందుకు జిమ్‌లో అధికంగా కసరత్తు చేసేవారు ఈ సమస్య బారిన పడే అవకాశం అయితే ఉంది.

ఈ సమస్యను వైద్యులు పెరోనియల్ న్యూరోపతీ అని అంటారు. సమస్యకు వీలైనంత వేగంగా చికిత్స అందించని పక్షంలో శాశ్వత పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. అతిగా వ్యాయామం చేయడం వల్ల భుజాలు స్థానభ్రంశం చెందే ఛాన్స్ ఉండగా కొంతమందిలో మెడ, వెన్ను నొప్పులు తలెత్తే ఛాన్స్ అయితే ఉంటుంది.

అతిగా వ్యాయామం చేయడం వల్ల దీర్ఘకాలంలో ఊహించని స్థాయిలో నష్టాలు కలిగే ఛాన్స్ ఉంటుందని చెప్పవచ్చు. అతిగా వ్యాయామం చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యానికి హాని కలుగుతుంది. అతిగా వ్యాయామం చేస్తే ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక రుగ్మతలు తలెత్తే ఛాన్స్ ఉంటుంది.