ఈ ఆకులు రోజూ నాలుగు తింటే ఏ వ్యాధి దరి చేరదట.. అసలేం జరిగిందంటే?

మనలో దాదాపుగా ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క ఉంటుంది. శరీరం నుంచి ఎన్నో వ్యాధులను దూరం చేయడంలో తులసి మొక్క సహాయపడుతుంది. ఇంట్లో తులసి చెట్టు తప్పకుండా పెంచుకోవాలని పెద్దలు సైతం చెబుతున్న సంగతి తెలిసిందే. నీళ్లలో తులసి ఆకులు వేసుకుని తాగితే షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి. నోటి ఆరోగ్యంను మెరుగుపరచడంలో తులసి తోడ్పడుతుంది.

తులసి నీళ్లు తాగడం వల్ల ఒత్తిడి తగ్గడంతో పాటు ఇందులో ఎన్నో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అయితే ఉంటాయి. తులసి జీర్ణక్రియకు మేలు చేయడంతో పాటు శ్వాసకోశ సమస్యలు దూరం చేస్తుంది. తులసిలో విటమిన్‌ ఏ, విటమిన్‌ డి, ఐరన్, ఫైబర్‌, ఆల్సోలిక్‌ యాసిడ్, యూజినాల్ వంటి పోషకాలు ఉంటాయి. తులసి ఆకులలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఏజింగ్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం గమనార్హం.

తులసి ఆకులు తీసుకోవడం ద్వారా శరీరానికి లాభం తప్ప నష్టం లేదనే సంగతి తెలిసిందే. తులసిలో ఉండే ముఖ్యమైన నూనెలకు యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండటంతో పాటు వాపు, ఇన్ఫ్లమేషన్‌ సంబంధిత లక్షణాలను తగ్గించడానికి ఇవి ఎంతగానో సహాయపడతాయని చెప్పవచ్చు. ఆయుర్వేదంలో సైతం తులసికి ఎంతో ప్రాధాన్యత ఉండటం గమనార్హం.

తులసిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ వైరల్ గుణాలు ఉండగా జలుబు, దగ్గు నుంచి ఉపశమనం లభించేలా చేయడంలో తులసి ఆకులు తోడ్పడతాయి. తులసి రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడుతుందని చెప్పవచ్చు. గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి తులసి ఆకులు ప్రభావవంతంగా పనిచేస్తాయని చెప్పవచ్చు.