మనలో చాలామంది ఏదో ఒక సందర్భంలో నల్ల నువ్వుల గురించి వినే ఉంటారు. నల్ల నువ్వులు తీసుకోవడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. నల్ల నువ్వులు తీసుకోవడం ద్వారా చర్మానికి సంబంధించిన బెనిఫిట్స్ తో పాటు జుట్టుకు సంబంధించిన బెనిఫిట్స్ ను సైతం పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఆయుర్వేదం ప్రకారం ఇతర నూనెలతో పోల్చి చూస్తే నువ్వుల నూనె మంచిదని చెప్పవచ్చు.
నువ్వుల నూనె ద్వారా శరీరానికి అవసరమైన ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన పిండిపదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు లభించే అవకాశాలు అయితే ఉంటాయి. స్త్రీలలో హార్మోన్ల సమస్యకు నువ్వుల నూనె సులువుగా చెక్ పెడుతుంది. వంటకాలలోను, అటు ఆయుర్వేద పరంగా నువ్వుల నూనెను ఎక్కువగా వినియోగిస్తున్నారు. నువ్వు గింజల్లో నూనె పదార్థంతోపాటు ప్రొటీన్ కూడా ఎక్కువ మొత్తంలో లభిస్తుందని చెప్పవచ్చు.
రోగనిరోధక శక్తిని పెంచడంలో నువ్వుల నూనె తోడ్పడుతుంది. నువ్వుల నూనె తీసుకోవడం ద్వారా ఆస్త్మా, బ్రొకైటిస్, జలుబు, దగ్గు, వంటి ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. నువ్వుల నూనె తీసుకుంటే ప్యాంక్రియాటిక్ పనితీరు మెరుగ్గా ఉండటంతో పాటు బ్లడ్ షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. కోలన్ క్యాన్సర్ సెల్స్ గ్రోత్ ను ఆలస్యం చేయడంలో ఈ నూనె తోడ్పడుతుంది.
యాంటీ కాన్విల్సివ్ లక్షణాలు అధికంగా ఉన్న నల్ల నువ్వులు శరీరానికి కలిగించే లాభం అంతాఇంతా కాదు. నల్ల నువ్వుల్లో ఉండే ఔషధ గుణాల వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ సమస్యకు సైతం చెక్ పెట్టవచ్చు. నల్ల నువ్వుల్లో ఉండే ఆప్టోప్టోసిన్ సెల్స్ వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. హార్ట్ మరియు కార్డియో వాస్కులర్ రిస్క్ ను తగ్గించడంలో ఈ నువ్వులు సహాయపడతాయి. క్యాన్సర్ నివారించే గుణాలు పుష్కలంగా ఉన్న నువ్వుల వల్ల ఎంతో మేలు జరుగుతుంది.