మహిళల్లో గర్భాశయ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ పొందాలంటే…ఈ నియమాలను కచ్చితంగా పాటించాల్సిందే!

ఈరోజుల్లో చాలామంది దంపతులు సంతానం లేని సమస్యను ఎదుర్కోవడానికి ప్రధాన కారణం స్త్రీలలో ప్రత్యుత్పత్తి వ్యవస్థలో కీలక పాత్ర పోషించే గర్భాశయంలో లోపాలు తలెత్తడమేనని నిపుణులు చెబుతున్నారు. ఈ రోజుల్లో మనందరం తీరిక లేని జీవితాన్ని గడుపుతున్నాము దాని ఫలితంగానే ఇలాంటి ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా స్త్రీలలో గర్భాశయ లోపాలు సవరించుకోవడానికి కొన్ని ఆహార నియమాలు పాటిస్తే గర్భాశయ ఆరోగ్యం మెరుగుపడి ప్రమాదకర ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ పొందవచ్చు.

గర్భాశయ ఇన్ఫెక్షన్ సమస్యలతో బాధపడే మహిళలు ప్రతిరోజు గ్రీన్ టీ ని సేవిస్తే అద్భుత ప్రయోజనాలను పొందవచ్చు. గ్రీన్ టీ లో ఉండే సహజ యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు గర్భాశయంలో పైబ్రాయిడ్ల పెరుగుదలను నియంత్రించి గర్భాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.అలాగే గోరువెచ్చని నీటిలో నిమ్మ రసాన్ని కలుపుకొని సేవిస్తే ఇందులో ఉండే యాంటీ బయోటిన్ గుణాలు, విటమిన్ సి మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంతో పాటు గర్భాశయ ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే వ్యాధి కారకాలను నియంత్రిస్తుంది.

రోజువారి డైట్ లో ఆకుకూరలు,కూరగాయలను, పండ్లు ఎక్కువగా తినే మహిళల్లో గర్భాశయ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం చాలా తక్కువని అనేక సర్వేల్లో వెల్లడైంది. ప్రతిరోజు ఆకుకూరలను ఎక్కువగా తింటే గర్భాశ ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే ఆల్కలిన్ ను స్థిరంగా ఉంచుతాయి.అన్ని కూరగాయల్లో పొటాషియం, మెగ్నీషియం, జింక్, కాల్షియం వంటి మినరల్స్ సమృద్ధిగా లభిస్తాయి కావున శరీరంలో ఈస్ట్రోజన్ లెవెల్స్ ను స్థిరంగా ఉంచి గర్భాశయంలో ట్యూమర్స్ ఏర్పడకుండా సహాయపడతాయి. అలాగే వీటిల్లో అత్యధికంగా ఉండే ఫైబర్ శరీరంలో వ్యర్ధాలను బయటికి పంపడంలో సహాయపడుతుంది. అలాగే విటమిన్ డి, ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉన్న గుడ్డు చేపలు డ్రై ఫ్రూట్స్ వంటివి ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాలి.