పచ్చి టమాటోలను తీసుకుంటున్నారా …. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!

టమోటా లేనిది మనం ఏ వంటను పూర్తి చేయలేం అయితే చాలామంది ఎర్రగా పండిన టమోటాలతో కూరలు చేయడానికి ఇష్టపడతారు. వీటిని కూర చేయటం వల్ల ఎంతో రుచిగా ఉంటుందని కూడా భావిస్తారు. అయితే ఎర్రని టమోటా పనులలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి అనే విషయం కూడా మనకు తెలిసిందే అయితే ఇతని టమోటాలు కన్నా పచ్చి టమోటాలను ఉపయోగించడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. మరి పచ్చ టమోటాలను తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

టమాటోలలో ఎక్కువగా విటమిన్ ‘సి’ పుష్కలంగా లభిస్తుంది. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల మన శరీరానికి, చర్మ కాంతికి కూడా బాగా సహాయపడతాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా లభిస్తాయి. దీనివల్ల రోగనిరోధక శక్తిను పెంచుతాయి.అంతే కాకుండా ఇన్ఫెక్షన్ నుండి విముక్తి కలిగిస్తాయి. పచ్చి టమాటోలలో మనకు కావలసిన బీటాకెరోటిన్ పుష్కలంగా లభిస్తుంది. పచ్చి టమాటోలను తినడం వల్ల కంటి సమస్యలు కూడా తగ్గుతాయి. పచ్చి టమాటోలలో మన శరీరానికి కావలిసిన సోడియం తక్కువగా, పోటాయం ఎక్కువగా అందుతుంది.

పచ్చి టమాటోలు తినడం వల్ల అధిక రక్తపోటు కూడా తగ్గుతుంది. అలాగే శరీరానికి కావాలసిన పోషకాలు కూడా అందుతాయి. కాబట్టి మీ రోజువారి తినే పదార్థాలు టమాటోలను కూడా చేర్చుకోవడం మంచిది. మనకు మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు అందాలు అంటే కేవలం ఎర్రని టమోటా పనులు మాత్రమే కాకుండా పచ్చని టమోటా పండ్లతో కూడా మనం వివిధ రకాల వంటలు తయారు చేసుకోవడం వల్ల మరింత అదనపు ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.