కీళ్లవాతం సమస్యతో బాధ పడుతున్నారా.. ఆ సమస్యకు చెక్ పెట్టే అద్భుతమైన చిట్కాలు ఇవే!

ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబంధం చాలామందిని కీళ్ల సంబంధిత సమస్యలు వేధిస్తున్నాయి. ప్రధానంగా కీళ్ల నొప్పులతో ఎంతోమంది బాధ పడుతున్నారు. ఒత్తిడి వల్ల, పోషకాహారం లోపించడం వల్ల, అరుగుదల వల్ల, వాతం వల్ల కీళ్లకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. తొలి దశలోనే కీళ్లవాతం నొప్పులను గుర్తించడం ద్వారా సమస్యకు సులువుగా చెక్ పెట్టే ఛాన్స్ అయితే ఉంటుంది.

మన శరీరంలో ఇమ్యూనిటీ వ్యవస్థను సమతుల్యంగా ఉంచడంలో తెల్ల రక్తకణాలు ఉపయోగపడతాయి. రోగ నిరోధక వ్యవస్థలో అసమతుల్యత వల్ల తెల్ల రక్తకణాలు మన శరీరంపై దాడి చేస్తాయి. దీనిని వాతం అని అంటారు. హార్మోన్ల అసమతుల్యత, జన్యుపరమైన లోపాలు, పర్యావరణంలో ఏర్పడే మార్పుల వల్ల ఆటో ఇమ్యూన్ వ్యాధులు వస్తాయి. ఎక్స్ రే, రక్త పరీక్షల ద్వారా ఈ సమస్యను గుర్తించవచ్చు.

కీళ్లవాతంతో బాధ పడేవారు సమతుల్యమైన ఆహారంను తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. కూరగాయలు, పప్పులు ఆహారంలో భాగం తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఆలివ్ నూనెను వాడుకోవడం ద్వారా పాలు, పెరుగు, గుడ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా శరీరానికి మంచి జరుగుతుంది. పాలు, పెరుగు, గుడ్లు, చేపలు, బాదం, సోయా బీన్స్ తీసుకుంటే కీళ్ల వాతం సమస్య దూరమవుతుంది.

కీళ్లవాతం సమస్యతో బాధ పడేవారు మద్యపానం, ధూమపానంకు దూరంగా ఉంటే మంచిది. యోగా, ధ్యానం చేయడం ద్వారా ఒత్తిడిని కంట్రోల్ లో పెట్టుకోవచ్చు. రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుకోవడం వల్ల కీళ్లవాతం దూరమవుతుంది. ప్రతిరోజూ కనీసం గంట పాటు వ్యాయామం చేస్తే మంచిది.