చిన్న వయస్సులోనే మతిమరపు సమస్యతో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో సమస్యకు చెక్!

ఈ మధ్య కాలంలో మతిమరపు సమస్య సాధారణం అయిపోయింది. వయస్సుతో సంబంధం లేకుండా చాలామందిని ఈ సమస్య వేధిస్తోంది. సోంప్‌, ధనియాలు, ఏలకులు, సీమ బాదంపప్పు, పటికబెల్లం విడిగా చూర్ణం చేసి, సమానంగా కలిపి ఉంచుకుని, రోజూ రాత్రి పడుకునే ముందు ఒక స్పూన్‌ పొడిని పాలతో కలిపి తీసుకుంటే మతిమరపు సమస్య తక్కువ సమయంలోనే తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి.

భోజనం చేసిన తర్వాత రోజూ పది గ్రాముల సోంపును తింటే జీర్ణక్రియ, శ్వాసక్రియ సాఫీగా జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. ఆస్తమా, దగ్గు వంటి వ్యాధులు ఉన్న వారు సోంపును తినడం వల్ల ఉపశమనం పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు బ్రిస్క్ వాక్ చేయడం, రోజుకు 6 గంటలు నిద్రపోవడం, ఒత్తిడికి దూరంగా ఉండటం ద్వారా ఈ సమస్యలను అధిగమించవచ్చు.

ఒత్తిడి వల్ల గుండె జబ్బులు, మధుమేహంతో పాటు మతిమరపు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. శరీరంలో హానికర కొవ్వులు ఎక్కువైనా మతిమరపు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. బీపీని అదుపులో ఉంచుకుని బరువు పెరగకుండా చూసుకుంటే మతిమరపు సమస్యను సులువుగా అధిగమించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

ఆహారంలో ఉప్పు తగ్గించడం ద్వారా కూడా ఈ సమస్య దూరమయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. తరచూ వ్యాయామం చేయడం ద్వారా కూడా మతిమరపు దూరమవుతుంది. సామాజిక జీవనం ద్వారా కూడా ఈ సమస్యను అధిగమించవచ్చు. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం ద్వారా ఈ సమస్యను సులువుగా అధిగమించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.