తరచూ చెవినొప్పి వేధిస్తోందా.. ఈ చిట్కాలు పాటిస్తే చెవినొప్పికి శాశ్వతంగా చెక్!

చెవి నొప్పికి చాలా సులభమైన చిట్కాలు ఉన్నాయి, అవి నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. హాట్ కంప్రెస్, అల్లం రసం, ఆలివ్ నూనె, మరియు నమలడం, మ్రింగడం, లేదా ఆవలించడం వంటివి చెవి నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. హాట్ కంప్రెస్‌ని నొప్పి ఉన్న చెవికి 15 నిమిషాల పాటు ఉంచడం వల్ల నొప్పి తగ్గుతుంది. అల్లం రసాన్ని చెవి బయట రాసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి.

వేడి చేసిన ఆలివ్ నూనెను చెవిలో 1 నుంచి 2 చుక్కలు వేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది. నమలడం, మ్రింగడం, లేదా ఆవలించడం వంటివి చెవుల్లో ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. నొప్పి మరీ ఎక్కువగా ఉంటే మాత్రం పెయిన్ కిల్లర్స్ వేసుకోవాలి. వెల్లుల్లి నూనెను చెవి చుట్టూ రాయడం వల్ల నొప్పి తగ్గుతుంది. కోల్డ్ కంప్రెస్ ను చెవికి అప్లై చేయడం వల్ల కూడా నొప్పి తగ్గుతుందని చెప్పవచ్చు.

చెవి నొప్పి తీవ్రంగా ఉంటే లేదా రెండు రోజుల పాటు కొనసాగితే వైద్యుడిని సంప్రదించి చికిత్స చేయించుకోవాలి. చెవి నొప్పి ఉంటే పారాసెటమాల్ ను కలిగి ఉన్న మందులను తీసుకోవడం మంచిది కాదు. చెవి నొప్పితో పాటు జ్వరం, వినికిడి లోపాలు ఉంటే మాత్రం వైద్యుడిని సంప్రదించి సలహాలు, సూచనలు తీసుకోవాలి. చెవినొప్పిని నిర్లక్ష్యం చేయడం ఏ మాత్రం మంచిది కాదు.

కొన్ని సందర్భాల్లో చెవినొప్పి మరీ భయంకరంగా ఉంటుంది.. చెవిలో ఏదైనా పురుగు దూరిన సమయంలో కూడా చెవినొప్పి తీవ్రం అవుతుందని చెప్పవచ్చు. చెవి నొప్పి వల్ల దీర్ఘకాలంలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. చెవినొప్పి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం దీర్ఘకాలంలో నష్టపోవాల్సి వస్తుంది.