మనలో చాలామంది ఎన్నో ఆరోగ్య సమస్యలతో బాధ పడుతూ ఉంటారు. అలాంటి ఆరోగ్య సమస్యలలో డ్రై స్కిన్ సమస్య ఒకటి. వాతావరణం మారగానే మొదటగా దాని ప్రభావానికి లోనయ్యేది చర్మం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చలికాలంలో ఎక్కువమంది పొడి చర్మం సమస్యతో ఇబ్బందులు పడుతుంటారు. కొంతమంది సెన్సిటివ్ స్కిన్ ను కలిగి ఉంటే మరి కొందరు మిక్స్డ్ స్కిన్ ను కలిగి ఉంటారు.
డ్రై స్కిన్ సమస్యతో బాధ పడేవారు ముఖం కడుక్కోవడానికి వేడి నీరు ఎక్కువగా ఉపయోగించకూడదు. వేడి నీరు డ్యామేజ్ అయిన చర్మాన్ని మరింత లోతుగా దెబ్బ తీసే అవకాశాలు అయితే ఉంటాయి. ఎక్కువ రసాయనాలు ఉన్న సోప్ లను కూడా అవైడ్ చేస్తే మంచిది. పొడి చర్మం ఉన్నవారు వాతావరణానికి చర్మం దెబ్బతినకుండా మాయిశ్చరైజర్ వాడాలి.
ఆహారంలో ఆరోగ్యకరమైన కొవ్వులు తీసుకుంటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. బాదం, వాల్నట్స్, జీడిపప్పు వంటివే కాకుండా అవకాడో చేర్చితే చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. శరీరాన్ని శుద్ది చేసి చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో నిమ్మరసం నీరు బాగా తోడ్పడుతుందని చెప్పవచ్చు. నిమ్మకాయ నీరు తాగితే జీర్ణక్రియ మెరుగవుతుందని చెప్పవచ్చు.
నూనెతో శరీరం అంతా మసాజ్ చేసుకోవడం వల్ల పొడి చర్మం సమస్యలు తగ్గే అవకాశాలు ఉంటాయి. నూనెను శరీరం అంతా పట్టించి అభ్యంగ స్నానం చేస్తే మంచిది. శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడటంతో పాటు ఒత్తిడిని తగ్గించడంలో ఇవి సహాయపడతాయి.